ఎన్నికలు వస్తున్నాయి, ఎవరైనా పల్లెలో మరణిస్తే.. మనం ఆ మరణాన్ని ఎన్నికల సమయంలో ఎలా ఉపయోగించుకోవచ్చు, దాని ద్వారా లబ్ధి ఎలా పొందవచ్చు అనే ఆలోచనలో టీడీపీ పార్టీ సాగుతోంది. నిన్న పుట్టపర్తి జిల్లా నల్లమాడ మండలంలో ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. నల్లమాడ మండలం కుటాలపల్లికి చెందిన అమర్నాథ్ రెడ్డి గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో మరణించాడు. అమర్నాథ్ రెడ్డి ఏ పార్టీకీ చెందిన వ్యక్తి కాదు. కానీ పుట్టపర్తి టీడీపీ మాజీ ఎమ్మెల్యే , మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి శవ రాజకీయం మొదలుపెట్టాడు. చనిపోయినా వ్యక్తి టీడీపీ కార్యకర్త అని, చంపింది వైసీపీ వారు అనే వాదనలు మొదలుపెట్టి ఆ హత్యకు రాజకీయాన్ని అంటించాలనే ప్రయత్నం చేశాడు.
కానీ పోలీస్ విచారణలో మృతుని భార్య తన భర్త ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాదు అని, తన భర్తకి ఎలాంటి ఆర్థిక , భూ తగాదాలు లేవని, ఎవరి మీద అనుమానం లేదు అని పోలీసులకి తెలిపింది. పోలీసులు తమ విచారణను వేగవంతం చేసి దోషులను పట్టుకోవాలని కోరింది. సంఘటన స్థలానికి చేరుకున్న పుట్టపర్తి జిల్లా ఎస్పీ మాధవ రెడ్డి, పుట్టపర్తి డిఎస్పీ వాసుదేవన్ మీడియాతో మాట్లాడుతూ నిందితులను త్వరగా పట్టుకుంటాం అని , మరణించిన వ్యక్తి ఏ పార్టీ కి చెందిన వ్యక్తి కాదు అని తెలిపారు.
కానీ పల్లె రఘునాథ్ రెడ్డి ఈ హత్యకు రాజకీయ రంగు పులిమి లబ్ధి పొందాలని ప్రయత్నించారు.అంతటితో ఆగకుండా టీడీపీ అధిష్టానికి ఈ హత్యకు సంబంధించిన తప్పుడు వివరాలు ఇవ్వడం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, అచ్చెం నాయుడు పునః పరిశీలన చేసుకోకుండా సోషల్ మీడియా మాధ్యమాలలో వైసీపీ హత్య ఉదంతం అంటూ రాసుకుంటూ వచ్చారు. అధికార పార్టీకి ఈ హత్యకు సంబంధం లేదు అని పోలీసులు చెప్తున్నా వారి మాటను పట్టించుకోకుండా అనవసర రాద్ధాంతం చేశారు.
గతంలో చూసాం చంద్రబాబు నాయుడు బావమరిది హరికృష్ణ మృతదేహం వద్ద నాటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తో రాజకీయ పరమైన చర్చలు జరిపా అని బహిరంగంగా మీడియాతో చంద్రబాబు తెలిపారు. తన రాజకీయ అవసరాల కోసం ఎంతటికైన దిగజారే వ్యక్తి చంద్రబాబు నాయుడు అని విషయం రాజకీయ పరిజ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు. ఇలా హత్యలు పై చంద్రబాబు తన నీచ రాజకీయం ఎప్పుడు ఆపుతాడో చూడాలి.