సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని అంతమొందించేందుకు చంద్రబాబు నాయుడు కుట్రలు పన్నినట్లు తేటతెల్లమైంది. ఆయన డైరెక్షన్లో.. బోండా ఉమ ఆధ్వర్యంలో దుర్గారావు అనే నాయకుడు సతీష్ చేత రాయి వేయించినట్లు బయటపడింది. పోలీసుల విచారణలో సతీష్ సంచలన విషయాలు బయటపెట్టాడు.
ఈ హత్యాయత్నం వేనుక కుట్ర కోణం ఉందని మొదటి నుంచి పోలీసులు అనుమానించారు. ఆ దిశగానే దర్యాప్తు జరిగింది. రాయి విసిరిన సతీష్‌ను ఏ1గా, దుర్గారావును ఏ2ను పెట్టారు. ఈ కేసుకు సంబంధించి వారి అరెస్ట్ చూపించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. దుర్గారావు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టీడీపీలో యాక్టివ్‌గా ఉన్నట్లు గుర్తించారు. ఇతను చెబితేనే సీఎంపై రాయి విసినట్లు విచారణలో సతీష్ వెల్లడించాడు. బస్సుకు 20 అడుగుల దూరంలో వివేకా స్కూల్ పక్కన రోడ్డుపై నుంచి దాడి జరిగింది. రాయి విసిరిన అనంతరం సతీష్ తన స్నేహితులతో కలిసి సింగ్ నగర్లో బర్త్‌డే వేడుకలు చేసుకున్నాడు.
సీఎంపై దాడి విషయంలో ఎల్లో గ్యాంగ్ నీచాది నీచంగా వ్యవహరించింది. వైఎస్సార్సీపీ నేతలే చేయించుకుని సింపతీ డ్రామా ఆడుతున్నారని ప్రచారం చేసింది. తీరా టీడీపీ నేతలే కారణమని తేలడంతో ప్లేట్ తప్పింది. అన్న క్యాంటీన్లు తీసేశారని నిరసనగా దాడి చేశారని కట్టు కథలు అల్లుతోంది. కానీ పక్కా ప్లాన్‌తో తెలుగు తమ్ముళ్లు
దాడి చేయించినట్లు వెలుగు చూసింది.
ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. ఈ నేపథ్యంలో కేసుకు సంబంధించిన వివరాలను పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు ప్రధాన ఎన్నికల అధికారికి తెలియజేస్తున్నారు. కుట్ర కోణంపై ఇప్పటికే నివేదిక తయారు చేసి ఇచ్చినట్లు సమాచారం.