రాజకీయాలలో గెలుపోటములు సర్వసాధారణమైన అంశాలు అయినప్పటికీ కూడా టీడీపీనేతల అరాచకాలకు అడ్డు లేకుండా పోతుంది. ఓటమి భయంతో ఉన్మాదులుగా ప్రవర్తిస్తూ అమాయకుల ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. కేవలం ఓటమి తప్పదనే అభద్రతాభావంతోనే మంగళగిరిలో టీడీపీ అనుచరులు వీరంగం సృష్టించారు. ఎన్నికల ప్రచారం చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై దాడికి దిగారు.
గుంటూరు జిల్లా మంగళగిరిలో టీడీపీ నేతలు వీరంగం సృష్టించారు. నియోజకవర్గంలోని తాడేపల్లి రూరల్ మండలం కుంచనపల్లిలో ఎన్నికల ప్రచారం చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను దుర్భాషలాడటమే కాకుండా ద్విచక్ర వాహనాలతో ఢీ కొట్టారు. ఈ ఘటనలో ముగ్గురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర గాయాల పాలయ్యారు. తీవ్రంగా గాయపడినవైఎస్సార్సీపీ నేత మేక వెంకట్ రెడ్డి పరిస్థితి విషమంగా మారింది. రెండు రోజులపాటు ప్రాణాలతో పోరాటం చేసి నిన్న రాత్రి తుది శ్వాస విడిచారు.
అయితే స్థానిక సిఎస్ఆర్ రోడ్డులో ప్రచారం చేస్తున్న వైఎస్ఆర్సిపి నేతలను కొందరు దుండగులు అడ్డుకొని ఇక్కడ ప్రచారం చేయడానికి వీలు లేదంటే వారించడంతో మాట మాట పెరిగి ఈ పరిస్థితికి దారితీసింది. సీఎం జగన్ స్థానిక నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం చేస్తున్న వైసీపీ నేతలపై ఒక యువకుడు దురుసుగా వచ్చి ఎన్నిసార్లు చెప్పిన ప్రచారం ఆపరా అంటూ దుర్భాషలాడటమే కాకుండా వాహనంతో ఢీకొట్టాడు.. దీనికంతటికీ కారణం మంగళగిరిలో లోకేష్ మళ్లీ గెలిచే అవకాశాలు ఏమాత్రం లేకపోవడమే.. కేవలం ఓటమి భయంతోనే లోకేష్ నామినేషన్ వేసే రోజునే టీడీపీ వర్గాలు ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.