ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది కర్నూలు జిల్లాలో పార్టీలలో వలసలు ఊపందుకున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇప్పటికే అన్ని పార్టీలు తమ అభ్యర్ధులను ప్రకటించారు. టీడీపీలో ముందు నుండి పార్టీకీ కష్టపడిన వారిని కాదు అని డబ్బులు ఎవరు ఎక్కువ పార్టీకి ఇచ్చి ఖర్చు చేస్తారో వారికే టిక్కెట్లు కేటాయించడంతో మొదలైన రగడ అగ్గిలా రాజుకుని ఈరోజు కర్నూలు జిల్లా అంతటా వ్యాపించి టీడీపీ పార్టీని దహించి వేస్తుందిది. ఏ నియోజకవర్గం చూసుకున్న వలసలతో అట్టుడికి పోతున్నది.
ఆలూరు మాజీ టీడీపీ ఇంచార్జీ వైకుంఠం మల్లిఖార్జున, మాజీ ఎమ్మెల్సీ మసాలా పద్మజ, ఇద్దరు మాజీ జడ్పీటీసీలు ఈ నెల 12కు వైసీపీలో జాయిన్ అయ్యేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు. అలాగే టీడీపీ పార్టీ కీలక బీసీ నేత అయిన మాజీ ఎమ్మెల్యే కేఈ ప్రభాకర్ కూడా వైసీపీలోకి జాయిన్ అయ్యేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తన ముఖ్య కార్యకర్తలకు ఇప్పటికే సమాచారం అందించారు. కేఈ ప్రభాకర్ ను ఎలా అయినా ఆపాలని తన అన్న కేఈ క్రిష్ణమూర్తి చేస్తున్న ప్రయత్నాలకు ఆశించినంతగా స్పందన రావడంలేదని తెలుస్తుంది.
ఇక తనకు మంత్రాలయం టికెట్ నిరాకరించడంతో తిక్క రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మీద కోపంతో రగిలిపోతున్నారు. ఇప్పటికే నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. వారితో మాట్లాడి తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణ త్వరలో వెల్లడిస్తామని మీడియాకు వెల్లడించారు. డోన్ లో ఇప్పటికే సుబ్బారెడ్డి టికెట్ ఇస్తాము అని చెప్పి మోసం చేశారన్న బాధతో పార్టీకి దూరంగా వున్నారు. పాణ్యం, శ్రీశైలం లో కీలక నేత అయిన ఏరాసు ప్రతాపరెడ్డి ఇప్పటికే వైసీపీ నేతలకు అందుబాటులోకి వెళ్లినట్లు సమాచారం తెలుస్తుంది. గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ నే మెజారిటీ సీట్లు కైవసం చేసుకుంది. 2019 లో మొత్తం 14కి 14 వైసీపీనే కైవసం చేసుకోని కర్నూలును కంచుకోట గా మార్చుకుంది.
ప్రస్తుతం కర్నూలు టీడీపీలో కలిసి కట్టుగా పనిచేస్తే తప్ప కనీస పోటీ ఇచ్చే లేని పరిస్థితుల్లో, టీడీపీ ముఖ్య నాయకులు , కార్యకర్తలు వరుసగా పార్టీకీ రాజీనామా చేసి వైసీపీ లో జాయిన్ అవుతుంటే టీడీపీకి ఈసారి కూడా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఖాతా తెరిచే సూచనలు కనిపించడం లేదు అని టీడీపీ నేతలే మాట్లాడుకుంటున్నారు.