పల్నాడు జిల్లా నడిబొడ్డున జరగనున్న మేమంతా సిద్ధం సభ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపబోతుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. నిజానికి సిద్ధం సభ మొదట పల్నాడు జిల్లాలో జరపాలని భావించినా కొన్ని అనివార్య కారణాల వల్ల బాపట్ల జిల్లాలో జరిపారు. లక్షలాది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తరలిరావడంతో ఆ సభ గ్రాండ్ సక్సెస్ అయింది. అప్పటి నుండి పల్నాడు ప్రజలు సీఎం జగన్ నిర్వహించబోయే సభ కోసం వేయి కళ్లతో నిరీక్షిస్తున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నిరీక్షణ ఈనెల 10 న నెరవేరబోతుంది. పిడుగురాళ్ల బైపాస్ వద్ద మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా ఒక బహిరంగ సభను నిర్వహించబోతున్నారు. దీంతో ఈ సభపై అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా ప్రజలతో మమేకం అవుతున్న సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో ముందుకు దూసుకు పోతున్నారు. ప్రజలంతా సీఎం జగన్ బస్సు యాత్రకు బ్రహ్మరథం పడుతుండడంతో ప్రత్యర్థుల పార్టీల్లో కలవరం మొదలయింది..
కాగా పల్నాడు జిల్లా నడిబొడ్డున చుట్టూ ఆరు నియోజకవర్గాలు కవర్ అయ్యేలా నిర్వహించబోతున్న ఈ సభకు లక్షలాదిగా వైసీపీ కార్యకర్తలు తరలివచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మండే ఎండలను కూడా లెక్కచేయకుండా ప్రజలంతా సీఎం జగన్ నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం సభలకు తరలి వస్తుండడం జగన్ పట్ల ప్రజల్లో ఉన్న ప్రేమకు నిదర్శనమని పలువురు వ్యాఖ్యానిస్తుండగా మరోవైపు చంద్రబాబు నిర్వహిస్తున్న ప్రజాగళం సభలకు పెద్దగా స్పందన దక్కడం లేదు.. కనీసం పార్టీ వర్గాల నుండి కూడా ఆదరణ దక్కకపోవడంతో బాబు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఈనెల 10వ తేదీన పిడుగురాళ్ల బైపాస్ వద్ద ముఖ్యమంత్రి జగన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బహిరంగ సభ జరుగుతుందని, 12వ తేదీన రాజుపాలెం నుంచి గుంటూరు వైపు సత్తెనపల్లి మీదుగా రోడ్ షో ఉంటుందని, ఈనెల 24వ తేదీన సత్తెనపల్లి వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్నానని ఈ మూడు కార్యక్రమాలను విజయవంతం చేయాలని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి వైసీపీ శ్రేణులకు అంబటి రాంబాబు పిలుపునిచ్చారు.