ఏపీలో సార్వత్రిక ఎన్నికలు నోటిఫికేషన్ విడుదల తరువాత ప్రధాన పార్టీ అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ మొదలైంది. పల్నాడు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు తమ నామినేషన్ ర్యాలీలతో దూకుడును పెంచారు. నర్సరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఈరోజు మాచర్ల అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి , చిలకలూరిపట అభ్యర్ధి కావటి మనోహర్ నాయుడు, పెదకూరపాడు అభ్యర్థి నంబూరు శంకర్, వినుకొండ అభ్యర్థిగా బొల్ల బ్రహ్మనాయుడు భారీ ర్యాలీ గా వెళ్ళి నామినేషన్ వేశారు. […]
పల్నాడు జిల్లా నడిబొడ్డున జరగనున్న మేమంతా సిద్ధం సభ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపబోతుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. నిజానికి సిద్ధం సభ మొదట పల్నాడు జిల్లాలో జరపాలని భావించినా కొన్ని అనివార్య కారణాల వల్ల బాపట్ల జిల్లాలో జరిపారు. లక్షలాది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తరలిరావడంతో ఆ సభ గ్రాండ్ సక్సెస్ అయింది. అప్పటి నుండి పల్నాడు ప్రజలు సీఎం జగన్ నిర్వహించబోయే సభ కోసం వేయి కళ్లతో […]