2024 సార్వత్రిక ఎన్నికలకు మరి కొన్ని రోజుల ఉన్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆఖరి విడత ప్రచారం కోసం సిద్ధం అయ్యారు. తొలి విడతగా సిద్ధం పేరుతో రీజియన్ల వారీగా నాలుగు సభలు నిర్వహించారు, సిద్ధం పేరుతో జరిగిన సభలను తన కార్యకర్తలను ఉద్దేశిస్తూ చేపట్టిన తొలి విడత ప్రచారం కార్యక్రమం. సిద్ధం సభలో ముగిసిన వెంటనే మేమంతా సిద్ధం బస్సు యాత్ర పేరిట రాష్ట్ర మొత్తం 22 రోజులపాటు 23 జిల్లాలలో 16 భారీ బహిరంగ సభలో, తొమ్మిది రోడ్ షోలు, ప్రజలతో ముఖాముఖిలు వంటి కార్యక్రమాలు చేసుకుంటూ మేమంతా సిద్ధం బస్సు యాత్రను పూర్తి చేసుకున్నాడు. ఇప్పుడు చివరి విడతగా జగన్ కోసం సిద్ధం పేరిట ప్రచార కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అయ్యారు. జగన్ కోసం సిద్ధం పేరిట జరిగే ఈ ప్రచార షెడ్యూల్ ఈ విధంగా ఉంది. 15 రోజులు పాటు జరగనున్న ఈ ప్రచారం మొత్తం 45 నియోజకవర్గాలు కవర్ చేసే విధంగా ఉంది.
జగన్ కోసం సిద్ధం పేరిట నిర్వహించబోయే ప్రచార కార్యక్రమం మొదట తాడిపత్రి నియోజకవర్గంలో జరగనుంది . 28న తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరు.. 29న చోడవరం, పి.గన్నవరం, పొన్నూరు.. 30న కొండెపి, మైదుకూరు, పీలేరు.. మే 1న బొబ్బిలి, పాయకరావుపేట, ఏలూరులో సభలు నిర్వహించనున్నారు.
ప్రతిరోజూ రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రల వారీగా ఒక్కో సభ ఉంటుందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఆయా సభల్లో తన పాలనలో జరిగిన అభివృద్ధిని, కుల,మత,వర్గ, జాతి, రాజకీయ బేధాల్లేకుండా అందించిన సంక్షేమ లబ్ధిని వివరిస్తూనే.. మరోవైపు ప్రతిపక్ష కూటమి కుట్రలను ఎండగట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.