Ramoji Rao : సుప్రీం కోర్టులో రామోజీరావుకు(Ramoji Rao) షాక్ తగిలింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు సంబంధించిన కేసులను తెలంగాణకు బదిలీ చేయాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అంతేకాకుండా ఏదైనా అవసరం అనుకుంటే ఏపీ హైకోర్టులోనే తగిన పిటిషన్ వేసుకోవాలని మార్గదర్శికి సుప్రీకోర్టు స్పష్టం చేసింది.
మార్గదర్శి చిట్‌ఫండ్ సంస్థల్లో జరుగుతున్న అవకతవకలపై ఏపీ సీఐడీ వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఏపీలో నమోదైన కేసులను తెలంగాణకు బదిలీ చేయాలనీ మార్గదర్శి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కానీ సుప్రీంకోర్టు మార్గదర్శి వాదనలతో ఏకీభవించలేదు. ఈ సందర్భంగా ఏపీలో నమోదైన కేసులను తెలంగాణకు బదిలీచేసేందుకు తగిన కారణాలేవి కనిపించడం లేదని మార్గదర్శి పిటిషన్ ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. కేసు విచారణపై స్టే కావాలనుకుంటే ఏపీ హైకోర్టునే ఆశ్రయించాలని సూచించిన సుప్రీంకోర్టు కేసును కొట్టేస్తే పిటిషన్లన్నీ నిరర్థకమే కదా అని వ్యాఖ్యానించింది. ఏదైనా అవసరం అనుకుంటే ఏపీ హైకోర్టులోనే తగిన పిటిషన్ వేసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తాజా తీర్పు రామోజీకి పెద్ద ఎదురుదెబ్బగా చెప్పొచ్చు.