దాదాపు నలభై ఏళ్లపైగా తెలుగు రాజకీయాలని తన వార్తా పత్రిక ను అడ్డుపెట్టుకుని గింగిరాలు తిప్పిన రామోజీకి ఇది గడ్డు కాలం. నన్నెవరూ ఏం చేయలేరు, నేనే ఎవరి భవిష్యత్తునైనా నిర్ణయిస్తా, నా ముందు ఎంతటివాడైనా మోకరిల్లాల్సిందే అనే అహంకారం ఉండవల్లి అనే ఓ సాధారణ పొలిటీషియన్, 50 ఏళ్లు నిండని జగన్ అనే ఓ మొండి వాడి ముందు తునాతునకలు అవుతుంది.
అప్పుడెప్పుడో ఉండవల్లి మార్గదర్శి చిట్స్ మీద వేసిన కేసు ఇప్పుడు మళ్లీ రామోజీ మెడకు చుట్టుకుంది. చుట్టుకోవడం అంటే అలా ఇలా కాదు ఉరితాడులా బలంగా.. ఏళ్ల తరబడి కోర్టుకు కూడా హాజరు అవ్వకుండా కేసును నెట్టుకొస్తున్న రామోజీకి ఇప్పుడు గడ్డు కాలం ఎదురైంది. మార్గదర్శి అనే చిట్ ఫండ్ కంపెనీ లో ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్ లు సేకరించారు అనేది ఆరోపణ. నిజానికి అది ఆరోపణ కాదు వాస్తవమే, అందుకే చిదంబరం లాంటి గొప్ప మేధావి భార్య భర్తలిద్దరూ రామోజీ వ్యాపార భాగస్వామ్యులు అయినా, వారు సుప్రీం కోర్టులో పేరు మోసిన లాయర్లు అయినా, కోట్లు ఖర్చు చేసే గొప్ప గొప్ప లాయర్లను పెట్టుకునే స్తోమత ఉన్నా కూడా డిపాజిట్ లు వసూలు చేయడం కరక్టే అని వాదించలేని పరిస్థితి, తీసుకున్న డిపాజిట్ లు వెనక్కి ఇస్తాం అని మాత్రమే చెప్పుకోవాల్సిన దౌర్భాగ్యం. ఇప్పటికే ఇచ్చేసాం అని కూడా కోర్టు వారికి నివేదించారు కూడా. అంటే నిబంధనలకు వ్యతిరేకంగానే డిపాజిట్ లు స్వీకరించారు కదా అనేది ఉండవల్లి వాదన. ఈ కేసు లో జగన్ సీఎం అయ్యాక ఏపీ ప్రభుత్వాన్ని కూడా ఇంప్లీడ్ చేయడం రామోజీకి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు…
జగన్ ప్రభుత్వం ఈనాడుకు వ్యతిరేఖం కాబట్టి వారి వాదన వినాల్సిన అవసరం లేదనేది రామోజీ లాయర్ల వాదన, ఈనాడుకు జగన్ వ్యతిరేకం అయితే, జగన్ కు ఈనాడు వ్యతిరేఖం. ఇందులో పాయింట్ ఏముంది. డిపాజిట్లు సేకరించింది చట్ట వ్యతిరేకంగానా కదా అనేది మూడు నాలుగు నెలల్లో తేల్చాలి అనేది సుప్రీం కోర్ట్ ఆర్డర్..
కేసీఆర్ రామోజీ పట్ల పాటించిన మెతక వైఖరే కేసీఆర్ చేసిన పాపం. ఉన్నన్ని రోజుకు మెత్తగా ఉండి అధికారం పోగానే కాటు వేశాడు రామోజీ, బహుశా ఈరోజు కేసీఆర్ బాధపడుతూ ఉండొచ్చు, జగన్ లా ఈ రామోజీ అనే విషపురుగును అధికారంలో ఉన్నప్పుడు చిదిమేసి ఉంటే బావుండేది అని. కానీ జగన్ మాత్రం కేసీఆర్ లా కాదు. తను ఏమైపోయినా పర్వాలేదు, రామోజీ అనే పవర్ బ్రోకర్ రాజకీయాలని, ప్రజల మనోగతాలను, ప్రజాస్వామ్యాన్ని శాశించకూడదు అనే భీష్మించుకు కూర్చున్నాడు. 2024 లో మరలా అధికారంలోకి వస్తే మాత్రం రామోజీ జైలుకు పోవడం ఖాయం.. అందుకే ఏ కోశానా జగన్ మళ్లీ సీఎం అవ్వకూడదు అని రోజూ తన పత్రికలో విషం పూసి ఉచితంగా పంచుతున్నాడు.. కాకపోతే ఈ పేపర్ లు, టీవీ ల టెక్నిక్ లు 1990 ల నాటివి, ఇప్పుడు అవన్నీ ఔట్‌డేటెడ్, అందుకే రామోజీకి ఈ కష్టాలు…
రామోజీ మెడకు చుట్టుకోబోయే ఉరితాడు ఉండవల్లి అయితే, ఉరి వేయబోయే తలారి జగన్…