ఏపీలో ఎన్నికల హడావిడి మొదలైంది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా ఎన్నికల బరిలో దిగుతుండగా సీఎం జగన్ ని ఒంటరిగా ఓడించలేమని భావించిన టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా బరిలోకి దిగాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్న లక్ష్యంతో మూడు పార్టీలు జట్టు కట్టినా ఆయా పార్టీలు గెలిచే దాఖలాలు కనిపించడం లేదన్నది ప్రజల్లో వినిపిస్తున్న మాట. టీడీపీకి జనసేన, బీజేపీతో అసహజ పొత్తు వల్ల నష్టమే కానీ లాభం లేదని ఈ మూడు పార్టీల మధ్య ఓట్ల బదలాయింపు కష్టమేనని ఇప్పటికే పలు సర్వేలు తేల్చి చెప్పాయి. ఇదే విషయాన్ని తాజాగా రాబిన్ శర్మ బృందం కూడా ఆయా పార్టీలకు స్పష్టం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా ధనవంతులకు సీట్లు కేటాయిస్తే గెలిచే అవకాశాలు ఎలా ఉంటాయని రాబిన్ శర్మ ప్రశ్నించినట్లు సమాచారం. అంతేకాకుండా జనసేన, బీజేపీకి కేటాయించిన 31 సీట్లలో 5 సీట్లకు మించి గెలిచే పరిస్థితి లేదని రాబిన్ శర్మ బృందం కుండ బద్దలు కొట్టినట్లు తెలుస్తుంది. పైగా పవన్ కళ్యాణ్ స్థిరం లేని రాజకీయాల వల్ల బాగా బలహీనపడ్డాడని, సర్వేలు, స్థానిక పరిస్థితులతో సంబంధం లేకుండా కూటమిలో సీట్ల పంపకం జరిగిందని, ధనవంతులకు సీట్లు అమ్ముకుంటే గెలిచే అవకాశం ఎలా ఉంటుందని చంద్రబాబును రాబిన్ శర్మ వెల్లడించినట్లు తెలుస్తుంది.
పార్టీని గెలిపించేందుకు తమ బృందం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని, క్షేత్రస్థాయి పరిస్థితిని వివరించినా పట్టించుకోనప్పుడు తమని సలహాలు అడగటం ఎందుకుని రాబిన్ శర్మ బృందం ఆవేదన వ్యక్తం చేసారని, దాంతో చంద్రబాబు వెంటనే ప్రశాంత్ కిషోర్ ని రంగంలోకి దించారని, ఆయనతో కలిసి పనిచేయాలని రాబిన్ శర్మ బృందాన్ని చంద్రబాబు ఆదేశించారని దాంతో అయిష్టంగానే పీకేతో కలిసి రాబిన్ శర్మ బృందం పనిచేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.