వైయస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాలంటీర్ సిస్టం ద్వారా వృద్దులకి వికలాంగులకి పెన్షన్ ఇంటికే అందిస్తూ దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. అయితే వాలంటీర్లపై కక్ష పెంచుకున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మొదటి నుండి వారిపై నిందలు మోపుతూ వారిని తూలునాడుతూ రావడమే కాకుండా ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎక్కడ వాలంటీర్లు పెన్షనర్లను ప్రభావితం చేస్తారో అనే భయంతో నిమ్మగడ్డ రమేష్ చేత ఎన్నికలు అయ్యే వరకు పెన్షనర్లకి పెన్షన్లు వాలంటీర్లు ఇంటికి వెళ్ళి ఇవ్వడానికి వీలు లేకుండా అధికారికంగా ఉత్తర్వ్యులు తేగలిగారు.
తెలుగుదేశం చేసిన ఈ పనికి పెన్షన్ అందుకునే వృద్దులు వికలాంగులు ఈ నెల 1వ తారీకున ఎర్రటి ఎండలో సచివాలయాలకు క్యూలు కట్టి పడ్డ ఇబ్బందులు చూసిన ప్రజల్లో టీడీపీ పై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇక వృద్దులు వికలాంగులు చంద్రబాబుకి పెట్టిన శాపనార్ధాలు చూసిన తెలుగు తముళ్ల వెన్నులో వణుకు మొదలైంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ తాము తీసుకున్న నిర్ణయం బూమరాంగ్ అవ్వడంతో తెలుగుదేశం నేతలే తలలు పట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే రాబోయే మే నెలల్లో మళ్ళీ పెన్షన్లు అందుకునేందుకు వృద్దులు వికలాంగులు సచివాలయాల దగ్గర క్యూ కడితే తమపై వ్యతిరేకత తీవ్రంగా వ్యక్తమవుతుందని గ్రహించిన తెలుగుదేశం ప్లాన్ మార్చింది.
ఈ సారి పెన్షన్లు బ్యాంక్ ఖాతాల్లో వేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలనేలా విజ్ఞప్తులు పంపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సంఘనికి వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈసీ సైతం బ్యాంక్ ఖాతాల్లో పెన్షన్ వేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారి చేసింది. ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా పెన్షలు బ్యాంక్ ఖాతాల్లో వేయనునట్లు ప్రకటించింది . రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షనర్లలో 75% మందికి మాత్రమే బ్యాంక్ ఖాతాలు ఉన్నాయని వారికి బ్యాంక్ లో జమచేసి మిగిలిన వారికి శాశ్వత ఉద్యోగుల ద్వారా ఇంటికే పెన్షన్ అందచేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
తెలుగుదేశం ఈసీకి చేసిన ఫిర్యాదుతో వృద్దులు మరింత ఇబ్బందులు పడక తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. వృద్దులు రేపటి రోజున పెన్షన్ కోసం ఎండల్లో బ్యాంకులు, ఏటీఎం మెషీన్ల చుట్టూ తిరగాలసిన పరిస్థితి వచ్చిందని, సచివాలయాలు గ్రామల్లోనే ఉంటాయని , ఇక ఈ బ్యాంకులకు వెళ్ళాలి అంటే గ్రామం దాటి వెళ్ళాలని ఇది వృద్దులకు, వికలాంగులకి మరింత ఇబ్బందులు తెస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. వాలంటీర్లను తీసేసే విధంగా తెలుగుదేశం చేసిన కుట్ర ప్రభావం రాష్ట్రంలో ఉన్న వృద్దులు , వికాలంగులపై పడిందని ఈ నెలలో సచివాలయాల చుట్టు పెన్షన్ కోసం ఎండలో వచ్చిన 39 మంది వృద్దులు చనిపోయారని. అయినా తెలుగుదేశానికి కనికరం కలగక ఇంకా కుట్రలు చేస్తూ పెన్షనర్లను మరింత ఇబ్బందుల్లోకి నెడుతున్నారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది.