ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఈ నెల 23న ప్రోగ్రెస్ రిపోర్టులు జారీ చేయాలని ఆంధ్రప్రదేశ్విద్యాశాఖ భావించింది. ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ పంపిణీలో భాగంగా విద్యార్థుల తల్లిదండ్రులతో పేరెంట్ టీచర్ మీటింగ్ ఏర్పాటు చేసింది. ఆ మీటింగ్ ముఖ్య ఉద్దేశం వచ్చే విద్యా సంవత్సరానికి విద్యార్థుల పురోగతి, చదువు, హాజరు శాతం పెంపు తదితర అంశాల పై సమావేశం నిర్వహించి విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం .
వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టాక ఈ తరహా కార్యక్రమాలు గత నాలుగేళ్లుగా జరుగుతూనే ఉన్నాయి. విద్యార్థులను చదువులో ప్రోత్సహించాలంటే తల్లిదండ్రుల సహకారం ఎంతో అవసరం. కార్పొరేట్ విద్యా వ్యవస్థలో పేరెంట్ టీచర్ మీటింగ్ ద్వారా ఆ విద్యార్థి యొక్క నైపుణ్యాలు, ఎక్కడ వెనుకబడి ఉన్నారో పూర్తి వివరాలను తల్లితండ్రులకు తెలియజేయడం ద్వారా వేసవి సెలవలు ద్వారా కొంచెం సమయాన్ని విద్యార్థులకు కేటాయించడం ద్వారా , వారు ఆ సబ్జెక్టులో మెలకువలు నేర్చుకోవడానికి వీలు ఉంటుంది. అలా ప్రభుత్వ పాఠశాలలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక తరచూ ఏర్పాటు చేస్తున్నారు. గత ఏడాది లాగే ఈ విద్యా సంవత్సరం చివరి రోజు పేరెంట్ టీచర్ మీటింగ్ ఏర్పాటు చేశారు. దాని పైన కూడా ప్రతిపక్షాలు రాజకీయం చేయడం మొదలుపెట్టి ఆ కార్యక్రమాన్ని ఆపే విధంగా ఎలక్షన్ కమీషన్ కు ఫిర్యాదు చేశాయి టీడీపీ శ్రేణులు.