ఏపీ లో టీడీపీ అనుబంధ సంస్థ చేసిన ఫిర్యాదు తో అగిన ఇంటింటికి ఫించన్ నిర్ణయం ఏపిలో ప్రకంపనాలు సృష్టిస్తోంది. వృద్ధులను ఈ నిర్ణయం భయపడేలా చేసి వారు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు. ప్రతి నెల మొదటి రోజునే ఇంటింటికి వచ్చి ఫించన్ లు ఇచ్చే వాలంటీర్లు రాకపోవడంతో వారు ఫించన్ ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు అడ్డుకున్నారు అని తెలియడంతో కాకినాడ రూరల్ తూరంగిలో ఫించన్ దారుడు అయిన వెంకట్రావు (70) విషయం తెలుసుకుందాము అని గ్రామ సచివాలయం కు బయలుదేరి వెళ్తుంటే మార్గ మధ్యలోనే గుండెపోటుతో మరణించారు. వెంకట్రావు కు భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు.
వాలంటీర్లు రాకపోవడంతో వారికి ఫోన్ చేసినా ఆ ఫోన్ లు అధికారులకు ఇవ్వడంతో ఫించన్ ల గురించి సమాచారం లేక వృద్ధుడు అయిన వెంకట్రావు కలత చెంది సచివాలయం కు వెళ్తూ మర్గ మధ్యలోనే గుండెపోటు తో మరణించారు. ఈ విషయం తెలియగానే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు గారు వెంకట్రావు కుటుంబాన్ని ఓదార్చి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఇది తెలిసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చలించి పోయి వెంటనే ఐదు లక్షల రూపాయలు అ కుటుంబానికి ప్రభుత్వము తరుపున అందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
ఇలాగే తిరుపతి జిల్లా వెంకటగిరి బంగారుపేటలో వృద్ధుడు వెంకటయ్య (80) వాలంటీర్లు రాకపోవడంతో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫించన్ దేనికి ఇవ్వ లేదు అని అడిగితే, వాలంటీర్లు ఫించన్ ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు అడ్డుకున్నారు మీరు గ్రామ సచివాలయం కు వెళ్ళి తెచ్చుకోవాలి అని చెప్పగానే అక్కడే ఆందోళనకు గురి అయ్యి ప్రాణాలు కోల్పోయ్యారు.
మరోవైపు ఫించున్ దారులు మాకు ఫోన్లు చేసి ఇంటికి వచ్చి ఫించన్ గురించి అడుగుతుంటే వారికి మేము ఫించన్ ఇవ్వలేము చంద్రబాబు నాయుడు టీడీపీ అడ్డుకున్నారు మేము ఇవ్వలేము అని చెప్పడానికి మాటలు రావటం లేదు, వాళ్ళ బాధలు చూస్తుంటే మనసుకు చాలా కష్టంగా వుంటుంది అని వాలంటీర్లు మదనపడుతున్నారు.