నిన్న తిరుపతి లో జరిగిన ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్ లో ఏపీ లో జరుగుతున్న విద్యావ్యవస్థ ప్రక్షాళనపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి ప్రసంగం జాతీయ మీడియా తో పాటు జాతీయ స్థాయిలో అందరి దృష్టినీ ఆకర్షించింది. రాజ్‌దీప్ సర్దేశాయ్ సంధించిన ప్రశ్నలకు సిఎం జగన్ ఇచ్చిన సమాధానాలు తను విద్యావ్యవస్థ యొక్క సమూల ప్రక్షాళనకు ఏ విధమైన కమిట్మెంట్ తో ఉన్నారనే విషయాన్ని క్లిస్టర్ క్లియర్ గా మన ముందుంచాయి…
అసలేం అడిగారు.. వాటికి జగన్ గారి సమాధానాలు ఏమిటి?
రాజ్‌దీప్ సర్దేశాయ్ ప్రశ్న: భారత రాజకీయాల్లో ప్రభుత్వాలు విద్యను చాలా నిర్లక్ష్యం చేశారనే అపవాదు ఉంది, దానిని మీరు మారుద్దాం అనుకుంటున్నారా? పేద-ధనిక, గ్రామీణ-పట్టణ వర్గాల మధ్య గల విద్యా అంతరాలలో మార్పు తేవాలి అనుకుంటున్నారా?
జగన్ సమాధానం: పేదరిక నిర్మూలన లో అతి ముఖ్య సాధనం గా నేను భావించేది విద్యనే. Right to Education కాదు Right to Quality Education కావాలి. విద్యను అందించడం కంటే నాణ్యమైన విద్యను అందించడం ముఖ్యం. పేదలకు ఒకరకమైన విద్య, ధనికులకు ఒకరకమైన విద్య లభించడం లో అర్థం ఏమిటి? ఇలా వేరువేరు విద్య అందడం అనేది కొనసాగితే పేద-ధనిక వర్గాల మధ్య అంతరం ఎప్పటికీ తగ్గదు. అందుకే ఉన్నవాడికి ఎలాంటి విద్య అందుబాటులో ఉందో పేద వారికీ అదే స్థాయి విద్యా అందాలి అనేదే నా ఆలోచన.
ప్రశ్న: ఇంగ్లీష్ మీడియం తో పాటు మూడో తరగతి నుండే టోఫెల్ ను ప్రవేశపెట్టడం చాలమంది నుండి విమర్శలకు దారి తీసింది. తెలుగును తుడిచిపెట్టే కార్యక్రమం జరుగుతుంది వెంకయ్య నాయుడు లాంటి వారి కూడా విమర్శిస్తున్నారు దీనిపై మీరేమంటారు?
సమాధానం: ఎవరైతే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తున్నారో వారికి నా సూటి ప్రశ్న! మీరు మీ మీ పిల్లలని ఏ మీడియం లో చదివిస్తున్నారు? తెలుగు మీడియమా లేక ఇంగ్లిష్ మీడియమా?
ప్రశ్న: గ్రామీణ స్థాయిలో ఒకేసారి ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెట్టడం కష్టం కదా? అలవాటు చేసుకోలేరేమో కదా? దీనివల్ల డ్రాపౌట్స్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది కదా?
సమాధానం: అలా జరగకూడదనే మేము బ్రిడ్జ్ కోర్స్ లతో మొదలుపెట్టాం. పాఠ్యపుస్తకాల్లో ఒకవైపు తెలుగులో మరోవైపు ఇంగ్లిష్ లో పాఠాలను ముద్రిస్తున్నాం బైజూస్ తో జతకట్టి మా సిలబస్ కి తగ్గట్టుగా వారి కోర్సులలో మార్పులు చేయించాం. 8 వ తరగతి నుండే పిల్లలకి ట్యాబ్లెట్స్ ఇచ్చాం. 60,000 పైగా తరగతులను IFP చేయించాం. అదేవిధంగా టీచర్ల కెపాసిటి బిల్డింగ్ చేపట్టాం..
ప్రశ్న: ప్రతీ ప్రభుత్వ పాఠశాల విద్యార్ధికి 8వ తరగతికి రాగానే ట్యాబ్లెట్స్ ఇస్తున్నారా? అందులో బైజూస్ కంటెంట్ ని ఇన్‌బిల్డ్ గా ఇస్తున్నారా?
సమాధానం: అవును, 8,9 తరగతి పిల్లలకి ఆల్రెడీ డిసెంబర్ 21 న టాబ్లెట్స్ ఇచ్చేసాం.
ప్రశ్న: డిసెంబర్ 21 అంటే మీ పుట్టిన రోజు కదా? మీ బర్త్‌డే గిఫ్ట్ గా పిల్లలకి ట్యాబెట్స్ ఇచ్చారా?
సమాధానం: అవును, నా పుట్టిన రోజు చదువుకునే పిల్లల చేతిలో టాబ్లెట్స్ నాకు గొప్ప సంతోషాన్నిస్తుంది కదా?
ప్రశ్న: జగన్మోహాన్ రెడ్డి వీటన్నింటినీ హడావిడిగా చేస్తున్నారా? ప్రపంచస్తాయి విద్యను అందించాలని అంతా సిద్ధం చేయకుండానే ప్రణాళిక ఏం లేకుండానే చేస్తున్నారు అని ప్రతిపక్షాల నుండి విమర్శ ఉంది! ఏమంటారు? ఇండియా దానికి సిద్ధంగా ఉందా?
సమాధానం: IB మా SCERT తో జాయిన్ అవుతుంది. IB రోడ్ మ్యాప్ ప్రకారం ఈ ఏడాది టీచర్ లకి కెపాసిటీ బిల్డింగ్ జరుతుంది. ఆ తర్వాత ముందుగా ఒకటవ తరగతి నుండి IB సిలబస్ ప్రవేశపెడతాం, తర్వాత ప్రతీ ఏడు ఒక క్లాస్ పెంచుకుంటూ పోతాం. పదేళ్లలో మా విద్యార్ధులు IB సర్టిఫికేషన్ పొంది ప్రపంచస్థాయి పోటీలో నిలుస్తారు. ధనికులే కాదు పేద విద్యార్థులు కూడా ప్రపంచస్థాయి విద్యను పొంది పోటీ లో నిలవాలి అనేదే నా ఆశయం..
ప్రశ్న: మీ ఆలోచన చాలా గొప్పది. గ్రామీణ ప్రాంతాల పిల్లలు UN లో రిప్రజెంట్ చేయడం, పాశ్చాత్య దేశాల్తో పోటీ పడటం సరే, కాని టీచర్లలో ఇంకా ఆ స్థాయిలో కెపాసిటీ బిల్డింగ్ జరగిందా? మీరు మరీ తొందరపడుతున్నారా?
సమాధానం: నేను ముందుగా చెప్పినట్లు ఇది రాష్ట్రప్రభుత్వం మరియు IB ఉమ్మడిగా చేపట్టిన కార్యక్రమం. ఈ సందర్భంగా IB వారికి నేను కృతజ్ఞతలు తెల్పుతున్నాను. వారిని మేము సంప్రదించగానే మా ఆలోచన నచ్చి మాతో జతకట్టి పనిచేయడానికి ఒప్పుకున్నారు. అంతేగాక వారి ఆఫీస్ ని మా SCERT ఆఫీస్ పక్కనే పెట్టి ఇక్కడి నుండే ఆపరేట్ చేయనున్నారు. మా గోల్ 2035 నాటికి మా విద్యార్థులు IB ఎగ్జామ్ లో నిలవాలి. అందుకోసం టీచర్ లకి అవసరమైన కెపాసిటీ బిల్డింగ్ లో IB మాకు సాయం చేస్తుంది.
ప్రశ్న: దీనికోసం పెద్దఎత్తున నిధులు అవసరం. సాధారణం గా విద్యపై ప్రభుత్వాలు పెట్టుబడి చేయవు అనే విమర్శ ఉంది కదా? మీకు సరిపడా నిధులున్నాయని మీరు భావిస్తున్నారా?
సమాధానం: ఇది ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి IB కూడా ముందుకు వచ్చి మాకు రాయితీలు కల్పించింది. మారుమూల విద్యార్థులకి కూడా నాణ్యమైన విద్య అందించాలి అని కుతూహలంగా ఉన్నారు.
ప్రశ్న: 2018 లో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ( పాఠశాలల్లోనమోదు నిష్పత్తి ) ప్రైమరీ ఎడ్యుకేషన్ లో జాతీయ స్థాయిలో 99.21% గా ఉంటే ఏపీ లో అది కేవలం 84.48 గా ఉంది. ఇప్పుడు మీరు ఆ డ్రాపౌట్స్ ని ఎలా తగ్గించాలి అనుకుంటున్నారు? నాడు-నేడు, అమ్మఒడి లాంటి పథకాలు దానికి సాయం చేస్తాయి అనుకుంటున్నారా?
సమాధానం: ఏపీ GER లో వెనుకబడి ఉంది. డ్రాపౌట్స్ కి కారణం ఏంటి? ఎందుకు పిల్లలను తల్లితండ్రులు బడులకి పంపడం లేదని ఆరా తీశాం. దాన్ని మార్చాలనే మధ్యాహ్న భోజనం లో ప్రతీరోజు వేర్వేరు మెనూలను సిద్ధం చేసాం. వారంలో ప్రతీ విద్యార్థి ప్రతీరోజు వేరువేరు రకాల భోజనాన్ని రుచిచూస్తాడు..
ప్రశ్న: ఆశ్చర్యంగా ఉంది మధ్యాహ్న భోజన పథకం గురించి మేం విద్యార్థులకి మ్యాంగో షేక్ ఇస్తాం అంటూ తమిళనాడు ప్రభుత్వం గర్వంగా చెప్పుకుంటోంది, మీరు సోమవారం నుండి శుక్రవారం వరకు వేర్వేరు మెనూ ఇస్తారా?
సమాధానం: అవును.
ప్రశ్న: మా రిపోర్టర్ లు వెళ్లి చెక్ చెయ్యొచ్చా?
సమాధానం: మీరు ఆల్రెడీ చూసొచ్చారు అనుకున్నా! ఇంకా చూడలేదా?
ప్రశ్న: విజయవాడ లాంటి పట్టణాల్లో వాటి చుట్టుపక్కల్లో అంటే సరే, మారుమూల గ్రామాల్లో కూడా ఇదే విధంగా చేస్తున్నారా? మీరు రివ్యూ చేస్తారా? గతంలో ప్రభుత్వాలు కూడా ఇలాగే చెప్పుకున్నాయి కదా?
సమాధానం: నేను వాటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నా. కలెక్టర్ లు జాయింట్ కలెక్టర్లు రివ్యూ చేసే వ్యవస్థ నడుస్తుంది. నేను కూడా నా స్థాయిలో ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నా, కేవలం విద్యాశాఖలో మాత్రమే రివ్యూ లు చేయడం కాదు, కలెక్టర్లతో కూడా రెగ్యులర్ గా రివ్యూ చేస్తున్నా కాబట్టి వ్యవస్థలో ఉన్నవారందరూ పకడ్బందీ గా వ్యవహరిస్తున్నారు..
రాజ్‌దీప్ సర్దేశాయ్: నాకిప్పుడు అర్థం అయింది! మీరు ఢిల్లీ లో ఎందుకు అంత తక్కువ సమయం గడుపుతారో….
ప్రశ్న: మీరు రాకముందు కూడా ఏపీ కి నిరుద్యోగం అతిపెద్ద సమస్య, దానికోసం మీరేమైనా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారా? ఉన్నత విద్యలో మీరు తీసుకొస్తున్న మార్పులు ఏంటి?
సమాధానం: కేవలం పాఠశాల విద్యా విషయలోనే కాదు ఉన్నత విద్యలో కూడా మార్పులు చేపట్టాం. జాబ్ ఒరియెంటెడ్ గా కరికులం మార్చాం. ఇంటర్న్‌షిప్ ని తప్పనిసరీ చేసాం. 4 ఇయర్స్ డిగ్రీ లో హానర్స్ ప్రోగ్రామ్ ని కూడా తీసుకొచ్చాం. ADEX తో భాగస్వాములమయ్యి దాదాపు 1800 కోర్సులను వచ్చే నెల నుండి ప్రవేశపెట్టబోతున్నాం. దానిద్వారా హార్వర్డ్ లాంటి గొప్ప విశ్వవిద్యాలయాల్లో అందించే కోర్సులను మా విద్యార్థులకి ఆన్లైన్ ద్వారా అందించబోతున్నాం.
ప్రశ్న: ఉదాహరణకు కొన్ని కోర్సుల గురించి చెప్పండి?
సమాధానం: ఉదాహరణకి B.Com తీసుకోండి ఎవరికీ అసెట్ మ్యానేజ్మంట్ గురించి తెలియదు, రిస్క్ మ్యానేజ్మంట్ గురించి తెలియదు దానివల్ల ప్రపంచ అవసరాలకు తగ్గట్టు మన విద్యా ప్రమాణాలు సరిపోవడం లేదు. ఇవి వెస్ట్రన్ కోర్సులలో ఉంటాయి. ఇలాంటి 1800 రకాల కోర్సులను అందించి సర్టిఫికేషన్ ఇప్పిస్తాం. హార్వర్డ్ లాంటి యూనివర్సిటీ లలో లభించే ఈ కోర్సుల ద్వారా మా విద్యార్థులు ప్రపంచ అవసరాలకు తగ్గట్టుగా మలచబడతారు..
ప్రాజ్దీప్ సర్దేశాయ్: తరచుగా మనం సౌత్ ఇండియా నార్త్ ఇండియా కంటే ముందుంది అంటుంటాం, ఈ 20 నిముషాలు మీతో మాట్లాడాక సౌత్ ఇండియా ఒక ప్రత్యేకమైన ఈకో సిస్టం ల్ ఎందుకు పనిచేస్తుందో అర్థం అయ్యింది..
ప్రశ్న: చాలా ఏళ్లనుండి విద్య విషయంలో కేరళ మోడల్ గురించి, ఈ మధ్య కేజ్రీవాల్ గురించి వింటున్నాం, మీరు వారికంటే మరింత భిన్నంగా ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది. విద్యపై ఎందుకు ఇంత ప్రత్యేక శ్రద్ద చూపుతున్నారు? రేపు ఈ అంశం ఎన్నికల్లో మిమ్మల్ని గెలిపిస్తుంది అనుకుంటున్నారా?
సమాధానం: రాజాకీయాలు వేరు, విద్య వేరు. పిల్లల గురించి రాజకీయ నాయకులకి అవసరం లేదు వారు పట్టించుకోరు. నిజానికి ఆ పిల్లల జీవితాలు బాగు చేయకపోతే పేదరికం ఎప్పటికీ తగ్గదు. వచ్చే పదేళ్లలో ఈ పిల్లలు కాలేజ్ లకి వెళ్లి, సమాజం లో ఉన్నత స్థాయి పౌరులుగా మారే సమయానికి ప్రపంచం మొత్తం వీరివైపు చూడాలి. అదే నా ఆశయం.
ప్రశ్న: అంటే కేవలం అక్షరాస్యత పెంచడమే కాదు విద్య అందించడం అంటే, వారికి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడమే మీ విజన్ గా భావిస్తున్నారా?
సమాధానం: అవును..
రాజ్‌దీప్ సర్దేశాయ్: మీ విజన్ లో సగం నెరవేరినా దేశం మొత్తం మీ విధానం వైపే చూస్తారు.. కంగ్రాట్స్…