2019 సార్వత్రిక ఎన్నికల అనంతరం వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత టిడిపి చంద్రబాబు ఎల్లో మీడియా టీడీపీ అనుబంధ సోషల్ మీడియా విభాగాలు చేయని దాడి లేదు. అందులో భాగంగానే ప్రజోపయోగం అయినటువంటి అనేక రకాల అంశాల మీద బాబు తన అనుయాయుల చేత కోర్టుల్లో కేసులు వేయించి అడ్డుకున్నటువంటి పరిస్థితి. అమరావతి రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ పై కావచ్చు, తిడ్కో ఇళ్ల కేటాయింపులపై కావచ్చు, గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలపై కావచ్చు ఇలా అనేక రకాలుగా ప్రజలకు మేలు చేసేటువంటి ప్రతి అంశం పైన చంద్రబాబు తన చెప్పు చేతల్లో నడిచే వ్యక్తుల చేత కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకున్నటువంటి సందర్భాలు ఎన్నో మనం చూస్తూ వచ్చాం..
రేపు జరగబోయే 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టిడిపి ముఖ్యంగా తనకు అత్యంత నమ్మకస్తుడైన తన సొంత సామాజిక వర్గానికి చెందిన గతంలో 2014 – 19 మధ్య కాలంలో చంద్రబాబు ఆశీస్సులతో ఎలక్షన్ కమిషనర్ గా నియమింపబడిన నిమ్మగడ్డ రమేష్ చౌదరి చేత వాలంటీర్లు పెన్షన్లు ఇవ్వకూడదు అని కోర్టులో పిటిషన్లు వేయించాడు. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ వాలంటీర్లు పెన్షన్ దారులకు పింఛన్లు ఇవ్వకూడదు అని ఆదేశాలు జారీ చేసింది. ఫలితంగా పెన్షన్ల పంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తమైంది. దీంతో ఎప్పుడూ ప్రతి నెల ఒకటో తారీఖున వృద్ధులు వికలాంగులు వితంతువులు ఇలా అనేక రకాల అర్హుదారులకు అందాల్సినటువంటి పెన్షన్ల పంపిణీ నిలిచిపోయింది.
నిజానికి జీతాలు ఎప్పుడైనా ఒకటి రెండు రోజులు ఆలస్యం అయ్యాయేమో కానీ పెన్షన్లు మాత్రం ఏ రోజు ఒక్క రోజు కూడా ఆలస్యంగా అందినటువంటి సందర్భం లేదు. గత 55 నెలలుగా కోడి కూయకముందే వికలాంగులకు వృద్ధులకు అవ్వ తాతలకు నడవలేని వారికి కదలలేని వారికి ఆసుపత్రుల్లో ఉన్నవారికి ఇలా అనేక రకాలుగా అవస్థలు పడుతున్న వారికి ప్రతినెలా ఒకటో తారీఖున తెల్లవారుజామునే అందించింది జగన్ ప్రభుత్వం. అసలు మునుపెన్నడూ లేని విధంగా ఒకటో తారీకున తెల్లవారకముందే పెన్షన్లు అందిస్తున్నది జగనే అనే విషయం అందుకుంటున్న వారికి తెలియదా? ఈ క్రమంలో వాలంటీర్లు కూడా ఎంతో చిత్తశుద్ధితో సేవా దృక్పథంతో పని చేస్తూ ప్రజలకు సేవ చేస్తూ వాలంటీర్లు ప్రజల మన్ననలు ఆదరాభిమానాలు పొందారు, జగన్ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చారు.
అయితే చంద్రబాబు మార్గదర్శకత్వంలో నిమ్మగడ్డ చేసిన పనికి తెలుగుదేశం పార్టీ దాని నాయకత్వంపై సర్వత్రా వ్యతిరేకత మొదలైంది. నెల నెలా 3000 చొప్పున 66 లక్షల మంది పింఛన్ లబ్ధిదారులకు రూ.1,952 కోట్లు ఇస్తున్న జగన్ ప్రభుత్వానికి కేవలం రాజకీయ స్వార్థం కారణంగా అడ్డుకట్ట వేసిన నిమ్మగడ్డ ఉదంతం తెలుగుదేశం పార్టీకి తలకి రోకలిబండ చుట్టినట్టయింది. దీనితో ఒక్కసారిగా టిడిపి అధిష్టానం చంద్రబాబు ఆ పెన్షన్ దారుల అగ్రహానికి బలవ్వక తప్పలేదు. ఏదో చేద్దామనుకుంటే ఇంకేదో అయింది అన్న చందాన నిమ్మగడ్డ రమేష్ తో రాజకీయ స్వార్థం కోసం ఒక వికృతి క్రీడకు తెర తీస్తే అదే చంద్రబాబు టీడీపీ పాలిట శాపంగా మారింది. ఈ నెల పెన్షన్ కోసం ఎండల్లో రోడ్డెక్కిన వృద్దుల్లో షుమారు 40 మంది ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం . ఈ పాపం రాబోయే ఎన్నికల్లో శాపమై వెన్నాడనుంది. నిజానికి బాబు హయాంలో పెన్షన్ల కోసం పెట్టిన ఖర్చు 28,000 కోట్లు కాగా… వైయస్ జగన్ ఈ ఐదేళ్ల కాలంలో పెట్టిన ఖర్చు అక్షరాల 89,000 కోట్లు అన్నది అధికారిక లెక్కలు చెబుతున్న విషయం.