వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఉన్న ప్రజాదరణను చూసి తెలుగుదేశం, జనసేన నేతలు తమ పార్టీలు వీడుతున్నారు. జగనన్నా మీ కోసం పనిచేస్తామని మేమంతా సిద్ధం బస్సు యాత్ర వద్దకు వెళ్లి వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. కాకినాడ జిల్లా రాజానగరం నియోజకవర్గం ఎస్టీ రాజపురం నైట్ స్టే పాయింట్ వద్ద పలువురు కలిశారు. ప్రత్తిపాడు నియోజవర్గం టీడీపీ నుంచి ఏలేశ్వరం నగర పంచాయతీకి చెందిన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పైలా సత్యనారాయణ కుమారుడు పైలా బోసు, పార్టీ పట్టణాధ్యక్షుడు సతివాడ రాజేశ్వరరావు, కౌన్సిలర్ జి.వీర్రాజు, చింతల పాండవులు తదితరులకు జగన్ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
జనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్‌రెడ్డి, మండలాధ్యక్షుడు కాటంరెడ్డి జగదీష్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ యాదవ్, టీడీపీ నాయకుడు, ఉదయగిరి మండల మాజీ ఎంపీపీ చేజర్ల సుబ్బారెడ్డి జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. కార్యక్రమంలో నెల్లూరు ఎంపీ అభ్యర్థి వి.విజయసాయిరెడ్డి, రూరల్ అసెంబ్లీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
మనుక్రాంత్‌రెడ్డి చేరికతో నెల్లూరు జిల్లాలో జనసేన దుకాణం క్లోజైంది. ఈయన పవన్ కళ్యాణ్ కోసం ఎంతో కష్టపడి పనిచేశారు. 2019లో నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయినా జిల్లా కార్యాలయాన్ని సొంత ఖర్చులతో నిర్వహిస్తూ వచ్చారు. నెల్లూరు సిటీ టికెట్ ఆశించి పనిచేశారు. అయితే సేనాని మోసం చేసి పొంగూరు నారాయణకు అమ్మేసుకున్నాడు. చేజర్ల సుబ్బారెడ్డిని టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రలోభాలకు గురి చేసి తనవైపు తిప్పుకొన్నాడు. కానీ సైకిల్ పార్టీలో నిత్యం అవమానాలు ఎదురవుతుండడం, వైఎస్సార్సీపీలో మాత్రం గౌరవం దక్కుతుందని భావించి సుబ్బారెడ్డి జగన్‌ను కలిసి జై కొట్టారు.