తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ కే పరిమితమయ్యాడు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందు చాలా హడావిడి చేసిన లోకేష్ ఇప్పుడు ఎక్కడా కనపడకుండా ఉండవల్లిలో తన ఇంటికే పరిమితమైనట్లు తెలుస్తోంది, ఆఖరికి తాను పోటీ చేయబోయే మంగళగిరి నియోజవర్గంలో కూడా పూర్తిస్థాయిలో తిరగడం లేదు. 2023 జనవరిలో అట్టహాసంగా ప్రారంభించిన యువగళం పాదయాత్రకు టిడిపి వారు అనుకున్నంత ప్రజాదారణ దక్కలేదు. చంద్రబాబు అరెస్టుతో ఒక రెండు నెలలు పాటు యువ గళం పాదయాత్రను పక్కన పెట్టి చంద్రబాబు బెయిల్ కోసం ఢిల్లీకి పరిమితమయ్యాడు. చంద్రబాబు విడుదల తర్వాత కూడా పాదయాత్రను ప్రారంభించకుండా 20 రోజులపాటు సేదతీరి తర్వాత తూతూ మంత్రంగా ఆ పాదయాత్రని పూర్తి చేశాడు.
నారా లోకేష్ యువగలం పాదయాత్ర చేస్తున్న సందర్భంలో ఏ నియోజకవర్గంలో తిరిగితే ఆ నియోజకవర్గంలో తనకి అనుకూలంగా ఉన్న నాయకుడికి టికెట్ ఇస్తానని హామీ ఇచ్చి ఆ మేరకు అక్కడ నిర్వహించే సభలలో అభ్యర్థి చెయ్యి పైకెత్తి రానున్న ఎన్నికల్లో ఇతనే పోటీ చేస్తాడు. మీరు తప్పక గెలిపించి తీరాలని వాగ్దానాలు చేశాడు. కానీ చంద్రబాబు నాయుడు తాను చెప్పిన నాయకులకి కాకుండా వేరే నాయకులకు టికెట్ ఇవ్వడంతో నారా లోకేష్ చంద్రబాబు పై కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. నారా లోకేష్ అలా చెప్పిన 40 మంది అభ్యర్థులకు ఒకరికి కూడా టికెట్ చంద్రబాబు నాయుడు ఇవ్వకపోవడం గమనార్హం. అభ్యర్థుల ప్రకటన ముందు శంఖారావం అంటూ పలు జిల్లాలలో సభలు నిర్వహించిన వాటికి అనుకున్నంత ఆదరణ దక్కకపోయేసరికి ఇంటికే పరిమితమయ్యాడు. అటు సభలకి జనాలు రాక, తన అనుకున్న వాళ్ళకి టికెట్లు ఇప్పించలేక ఏమీ చేయలేని స్థితిలో నారా లోకేష్ ఉండిపోయేసరికి ఇంటికి పరిమితమైనట్లు టిడిపి నాయకులు చెబుతున్నారు.