భవిష్యత్ టీడీపీ రథసారథిగా ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబు తనయుడు నారా లోకేష్ రాజకీయ భవిష్యత్తు ఇప్పటికి అగమ్యగోచరంగానే ఉంది. రాజకీయాల్లోకి వచ్చి దశాబ్దకాలం కావస్తున్నా ఇప్పటికి ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచిన దాఖలాలు లేవు. ప్రజల మద్దతతుతో చట్ట సభలకి వెళ్ళకుండా తండ్రి చాటున శాసన సభలో దూరిన వ్యక్తిగా ఇప్పటికి హేళన ఎదుర్కుంటున్న నారాలోకేష్ ఈసారైనా ప్రజామద్దతుతో చట్ట సభల్లోకి వస్తారా అనే మీమాంసలో తెలుగుదేశం క్యాడర్ ఉంది. దీనికి కారణం నారాలోకేష్ ఎంచుకున్న నియోజకవర్గం మంగళగిరి రాజకీయ చరిత్ర.
తెలుగుదేశం పార్టీ పురుడు పోసుకున్న రోజు నుంచి ఈ రాష్ట్రంలో ఆ పార్టీకి సత్ఫలితాలు ఇవ్వని నియోజకవర్గాల్లో మంగళగిరి కూడా ఒకటి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు 2019 వరకు 9 సార్లు శాసనసభకు ఎన్నికలు జరిగితే, కేవలం స్వల్ప మెజారిటీతో మంగళగిరిలో తెలుగుదేశం గెలిచింది రెండే సార్లు, అదీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం సమయంలో 1983 , 1985 ఇక 1989 నుండి నేటి వరకు ఒక్కసారి కూడా తెలుగుదేశం అక్కడ పాగా వేయలేకపోయింది. మరీ ముఖ్యంగా చంద్రబాబు చేతుల్లోకి తెలుగుదేశం వచ్చాక ఒక్కసారి కూడా ఆ నియోజకవర్గంలో గెలిచిన దాఖలాలు లేవు.
ఇటువంటి నియోజకవర్గాన్ని లోకేష్ ఎంచుకోవడానికి కారణం 2014లో రాష్ట్ర విభజన తరువాత జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం రావడం , మంగళగిరి పరిసర ప్రాంతం అమరావతిని రాజధాని ప్రాంతంగా మార్చి ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా భూములు కొల్లకొట్టడమే కారణం అని, ఆ భూములని రక్షించుకోవడానికే అక్కడే తాను శాసనసభ్యుడిగా ఉండాలని తీర్మానించుకున్నారని , లేకుంటే బీసీ సీట్ అయిన మంగళగిరిపై కమ్మ సామాజిక వర్గానికి చెందిన లోకేష్ ఎందుకు ఆసక్తి చూపుతున్నాడని, పైగా ఇక్కడ టీడీపికి గెలిచిన ట్రాక్ రికార్డ్ కూడా లేదని, 2019లో ఇదే లోకేష్ ఓడిపొయారు కూడా అంటూ అక్కడివారే ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఏదిఏమైనా 40ఏళ్ళుగా టీడీపీకి ఉనికే లేని చోట లోకేష్ గెలుస్తారా అనే టెన్షన్ ఇప్పుడు టీడీపీలో హాట్ టాపిక్ గా మారింది.