‘మీకు తెలుసు కదమ్మా.. హైదరాబాద్‌ను కట్టింది చంద్రబాబే’ ఈ మాటలు అన్నది ఎవరో చదువురాని తెలుగు తమ్ముడు కాదు. సాక్షాత్తు విదేశాల్లో చదువుకున్న బాలకృష్ణ కుమార్తె, లోకేశ్ భార్య నారా బ్రహ్మణి. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో తిరుగుతున్న ఆమె పై మాటలు అనేసరికి ప్రజానీకం నోరెళ్లబెట్టింది. అంతటితో ఆగలేదు. మరో సందర్భంలో ‘మూడు రాజధానులని అవన్నీ జరగటం జరిగింది. కవుల్లేరు. కరెంట్ బిల్లులు కట్టకపోతే పెన్షన్లు కట్ చేస్తున్నారు’ అన్నారు. దీనిని బట్టి నారా వారి ఫ్యామిలీ మొత్తానికి సబ్జెక్టు లేదనే విషయం స్పష్టమవుతోంది.
అందరూ రోబోల్లా ఎల్లో మీడియాలో వచ్చే మాటలు చెబుతున్నారు. దశాబ్దాల నుంచి చంద్రబాబు ‘హైదరాబాద్‌ను నేనే కట్టా. టెక్నాలజీకి ఆధ్యుడిని. ఐటీ ఉద్యోగాలు నా వల్లే వచ్చాయి. నా కంటే సీనియర్ రాజకీయ నాయకుడు ఈ దేశంలో లేడు’ అంటూ ఉన్నారు. ఇవే మాటల్ని ఆయన కుటుంబసభ్యులు గుడ్డిగా నేర్చుకున్నారు. ఎక్కడ సభ జరిగినా లోకేశ్ హైదరాబాద్‌ను తన తండ్రే ప్రపంచ పటంలో పెట్టాడని చెబుతాడు. భువనేశ్వరి కూడా ఇటీవల నిజం గెలవాలంటూ సభలు పెట్టి బాబు పాడే పాటలే పాడారు. తాజాగా ఆమెకు కోడలు బ్రహ్మణి తోడైంది. గత ఎన్నికల సమయంలో లోకేశ్ ఏదిపడితే అది మాట్లాడి నవ్వులపాలైతే ఈసారి ఆ ప్లేస్‌ను అతడి భార్య తీసుకుంది.
వాస్తవానికి హైదరాబాద్ చరిత్ర ఏంటో చదువుకున్న వారికి బాగా తెలుసు. కానీ వీళ్లంతా తమ వల్లేనని చెప్పుకొంటూ అభాసుపాలవుతున్నారు. ఎల్లో మీడియా పుణ్యాన కొందరు నమ్మి మోసపోయారు. సోషల్ మీడియా యుగంలోనూ ప్రజల్ని మభ్యపెట్టడానికి నారా గ్యాంగ్ ప్రయత్నిస్తూనే ఉంది. ఇకపోతే కరెంటు బిల్లులు కట్టకపోతే పింఛన్లు కట్ చేస్తున్నారని బ్రహ్మణి అన్న మాటలకు తెలుగు తమ్ముళ్లే జేబులో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్లిపోతున్నారు.
చంద్రబాబు అండ్ కో అజ్ఞానాన్ని చూసి జనం ఛీ కొడుతున్నారు. నిత్యం అబద్ధాలు చెప్పడమే వీరి పని. జగన్ హయాంలో పరిశ్రమలు ర రాలేదని ఫ్యామిలీ మొత్తం చెబుతున్నారు. తీరా గణాంకాలు చూస్తే వేరుగా ఉన్నాయి. రాష్ట్రం ధ్వంసమైపోయిందని ప్రచారం అందుకున్నారు. అది ఎలా అంటే ఏమీ చెప్పరు. ఎవరో స్క్రిప్ట్ రాసిస్తారు. వీళ్లు బట్టి పట్టి చెప్పేస్తున్నారు. మరోసారి అధికారం కోసం కుటుంబం మొత్తం రోడ్డెక్కి అబద్ధాలు చెబుతోంది. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతోంది. దీనికి మందు ఒక్కటే. 2019 నాటి తీర్పు మరోసారి ఇస్తే వీళ్ల బెడద తప్పుతుంది.
– వీకే..