Nara Bhuvaneshwari : ఇసుక అక్రమ రవాణా అడ్డుకుంటుందని మహిళా ఎమ్మార్వో ని ఇసుకలో పడేసి కొట్టిన చింతమనేని ని సపోర్ట్ చేస్తూ వాళ్లిద్దరి మధ్య పంచాయితీ పెట్టి చివరకి ఆమెదే తప్పని తేల్చాడు కదా అందుకే ఆయన మహిళా పక్షపాతి…
డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తా అని అధికారం లోకి వచ్చి ఐదేళ్లలో రూపాయి మాఫీ చేయకుండా, మళ్లీ ఎలక్షన్స్ రాగానే పసుపు కుంకుమ అని 20 వేలిస్తా అని చివరికి కొంత మందికే 6 వేలు ఇచ్చాడు చూడు అందుకు ఆయన మహిళా పక్షపాతి..
2019 ఎన్నికల ముందు డ్వాక్రా మహిళలు అందరికీ స్మార్ట్ ఫోన్లు ఇస్తానని చెవిలో పూలు పెట్టినందుకు
అంగన్వాడీ కార్యకర్తల మీద గుర్రాలెక్కిచ్చి తొక్కించాడు చూడు అందుకూ…
ఆడబిడ్డని కంటే 5 వేలు ఇస్తా అని 1996 లోనే మాటిచ్చి మోసం చేశాడు కదా అందుకూ…
ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఇస్తా అని మాటిచ్చి ప్రతిపక్షాలను దుమ్మెత్తి పోయించి తర్వాత టికెట్ లేదు ఏం లేదు పో అంటూ దివ్యవాణి లాంటి ఆడవాళ్లని మోసం చేసినందుకూ….
రాజకీయాలను రాజకీయాల్లా చూడకుండా, షర్మిల, రోజా వంటి ఆడవాళ్లని మీ తమ్ముడు బాలయ్య ఇంటి నుండే వ్యక్తిగత హననం చేస్తూ ప్రచారం చేసినందుకు…
లక్ష్మి పార్వతి ని సాకుగా చూపి, ఆడ మనిషికి పెత్తనం ఇచ్చేది ఏమిటి అని పార్టీ ని లాక్కుని, ఎన్టీఆర్ తాళి కట్టిన భార్య అని కూడా చూడకుండా ఆవిడ మీద నీచమైన ప్రచారం చేశాడు చూడూ అందుకు….
కోడలు మగ బిడ్డని కంటా అంటే అత్త వద్దంటుందా? సీత పాతివ్రత్యం నిరూపించుకున్నట్లు నిరూపించుకోవాలా?
అంటూ ఆడవారిని నీచంగా మాట్లాడే వ్యక్తిత్వం ఉన్నందుకూ…..
ఇలా బాబు మహిళల పట్ల చూపించే గౌరవ, భక్తి ప్రపత్తులూ ఆయన రాజకీయ జీవితం ఆరంభం నుండే అందరికీ తెలిసిందే… అయన రాజకీయ జీవితమంతా అన్ని వర్గాలనీ మోసం చేస్తూ అధికార దాహం తోనే జీవిస్తున్నాడు దానికి మహిళలు ఏం మొనహాయింపు కాదు. ఎలా నమ్ముతారు భువనేశ్వరి గారూ ఆయన మహిళా పక్షపాతని?