జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో గెలుపు కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. ఓటమి భయంతో పిచ్చిపిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడితో కలిసి ఎన్నికల ప్రచారం చేస్తూ ఇక్కడికి అప్పుడప్పుడు వస్తున్నాడు. పూర్తి బాధ్యతలను తన అన్న నాగబాబుకు అప్పగించాడు.
పిఠాపురంలో కొద్దిరోజులుగా మెగా మిడిల్ బ్రదర్ ఓవర్షాన్ ఎక్కువైపోయింది. నోటికి అడ్డూఅదుపు లేకుండా మాట్లాడుతున్నాడు. స్థానికంగా అంశాలపై అవగాహన లేకుండా వైఎస్సార్ కాంగ్రెస్‌పై బురద వేయాలని చూస్తున్నాడు. చంద్రబాబు ఇచ్చిన డబ్బు, డొనేషన్ల రూపంలో దండిన మొత్తాన్ని ఖర్చు చేస్తూ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. అందరూ కలిసి రాయలసీమ నుంచి మనుషుల వచ్చి వైఎస్సార్సీపీ తరఫున తిరుగుతున్నారని ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి ఇతర ప్రాంతాల్లో ఉన్న పవన్ అభిమానులే ఇక్కడికొచ్చి రచ్చ చేస్తున్నారు. చంద్రబాబు, పవన్ రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి జపం చేస్తూనే ఉన్నారు. రోజూ ఏదో ఒకటి అంటూనే ఉన్నారు. రెండు రోజుల క్రితం ఇద్దరూ రాయలసీమకు వెళ్లారు. పిఠాపురంలో పవన్‌ను ఓడించాలని మిథున్‌రెడ్డి ప్రయత్నిస్తున్నాడని బాబు ఆరోపించారు. సేనాని కూడా మంత్రి పెద్దిరెడ్డిని తిట్టి మిథున్‌పై వ్యాఖ్యలు చేశారు.
ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి వంగా గీత స్పందించారు.• మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేలా పవన్ వ్యాఖ్యలు చేశారు. తనను కొడుతున్నారు.. తిడుతున్నారని చెప్పుకొంటూ ఆయన జాలి పొందాలనుకోవడం తప్పు. వారిని ఏదో చేసేస్తున్నారనే వ్యాఖ్యలు జనసేన నుంచి వస్తున్నాయి. నాగబాబు మాటల• నూటికి నూరు శాతం కల్పితం. ఇప్పటికే పవన్• బ్లేడలతో దాడి చేస్తున్నారని రౌడీతత్వాన్ని పిఠాపురం నియోజకవర్గానికి అంటగట్టారు. ఇప్పుడు కడప నుంచి మనుషులు వచ్చేశారని ఆరోపణలు చేస్తున్నారు.• ఏడాది కాలం నుంచి మిథున్‌రెడ్డి మా పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్‌గా ఉన్నారు. నియోజకవర్గంలో పార్టీ సమస్యలు పరిష్కరించడానికి ఆయన వచ్చి వెళ్తారు. ఓటమి భయంతోనే ప్రతిపక్షాలు ఆయన్ను అంటున్నారు. ప్రస్తుతం పిఠాపురంలో బయట వాళ్లు ఎవరున్నారని లెక్కలు చూస్తే అసలు విషయం తెలుస్తుంది. నాగబాబు ఇష్టమొచ్చిన మాట్లాడుతున్నారు. నియోజకవర్గానికి ఏమి చేస్తారో వాళ్లు చెప్పడం లేదు. ముందు ప్రజలకు ఏం మంచి చేస్తారో చెప్పండి.