జనసేన అధ్యక్షుడి రెండో సోదరుడు నాగబాబు అనకాపల్లి ఎంపీ స్థానం నుండి పోటీ నుండి తప్పుకున్నట్లు తెలుస్తుంది. పొత్తులో భాగంగా టీడీపీ నుండి మూడు ఎంపీ స్థానాలు తీసుకున్న జనసేన అందులో ఒకటి ఖచ్చితంగా అనకాపల్లి స్థానం అని, పోటీ చేయబోయేది నాగబాబు అని అందరూ భావించారు, నాగబాబు కూడా పోటీ కి సిద్ధపడి, అనకాపల్లి లోనే తమ పార్టీ నుండి పోటీ చేయబోయే వ్యాపారవేత్త ఇంటిలో మకాం వేశాడు.. ఈ నేపథ్యంలో అందరూ అనుకున్నట్లు పోటీ చేయకుండా, కాడి మధ్యలోనే వదిలేసి ఇప్పుడు హైదరాబాద్ కి మకాం మార్చాడు… ప్రస్తుతమున్న పరిస్థితుల్లో వైసీపీ ని ఎదుర్కుని పోటీ చేసి గెలిచే సత్తా టీడీపీ- జనసేన కలిపి కూడా లేదని తేటతెల్లం అవ్వడంతో 2019 లో నర్సాపురం నుండి పోటీ చేసి ఘోర ఓటమిని చవి చూడటం తో మరోసారి అలాంటి రిస్క్ చేయదలచుకోవడం లేదా? లేక చంద్రబాబు, పొత్తులో భాగంగా కేటాయించిన 3 ఎంపీ సీట్లు కూడా లాగేసుకునే ప్రయత్నం చేస్తున్నాడా? లేక కొణతాల రామ కృష్ణ ని ఒప్పించలేక జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణే తన అన్న సీటును త్యాగం చేశాడా? అనేది తేలాల్సి ఉంది.
కాకపోతే నాగబాబు ది ముందు నుండీ తన తమ్ముడిలానే నిలకడ లేని మనస్తత్వం, వయసుకు తగ్గట్టుగా హుందా గా ప్రవర్తించింది లేదు, ఒకసారి ఏదో సందర్భంలో వేణుమాధవ్ , ఏదైనా ఈవెంట్ జరుగుతుంటే అక్కడ కమెడియన్ ల అందరికీ లీడర్ నాగబాబు అని, ఈవెంట్ లో అల్లరి అంతా ఆయన నాయకత్వంలోనే జరుగుతుంది అని అన్నట్లు, నాగబాబు ది ఎప్పుడు వయసుకు తగ్గ ప్రవర్తన కాదు..
2019 లో టిడిపి మీద, బాలకృష్ణ మీద ఘోరమైన విమర్శల తో కూడిన వీడియో లు చేసి, ఆఖరికి బాలయ్య అంటే ఎవరో తెలియదని, పాత సినిమాల్లో కమెడియన్ బాలయ్యే తనకు తెల్సు అని కూడా వీడియో వదిలాడు.. ఇప్పుడు మళ్లీ నిన్నటి వరకు టీడీపీ నీ భుజాన వేసుకునే తిరిగాడు. సినిమాల్లోనూ అంతే, తీసిన నాలుగు సినిమాలూ ఫ్లాప్ అయ్యాయి, ఆరెంజ్ సినిమా ఫ్లాప్ అవ్వడంతో సుసైడ్ చేసుకుందాం అనుకున్నా అని అవేదన వ్యక్తం చేశాడు. అక్కడా నిలకడ లేదు.
తాము ఎవరినైనా విమర్శిస్తాం గానీ, తమని ఎవరైనా విమర్శిస్తే మాత్రం సహించం అన్నట్లు ఆవేశంతో ఎగిరిపడుతుంటారు అన్నదమ్ములిద్దరూ… నిలకడ, ఓపిక అనే పదాలకు వారివురికీ అర్దం తెలియదు… అందుకే ఎప్పటికప్పుడు ఎదురు దెబ్బలు తింటూ, ఉన్న నలుగురు ఫ్యాన్స్ ని కూడా దూరం చేసుకుంటారు.