ఏపీలో ఎన్నికల వేడి మొదలయ్యింది, ఏ పార్టీ తరపున ఎవరు పోటి చేస్తున్నారో స్పష్టత వచ్చింది. విజయనగరం లో వైసీపీ పార్టీ తరపున కోలగట్ల వీరభద్రస్వామి మరొకసారి పోటీలో నిలబడుతున్నారు . కూటమిలో భాగంగా టీడీపీ నుండి విజయనగరం రాజ వంశానికి చెందిన పూసపాటి వారసురాలు అదితి మరొకసరి పోటీలో ఉండబోతున్నారు. ఇప్పటికే ప్రత్యక్ష రాజకీయాల నుండి తప్పుకుంటున్నా అని ప్రకటించిన అశోక్ గజపతి రాజు తన రాజకీయ వారసురాలిగా తన కూతురు అదితిని మరొకసారి విజయనగరంలో పోటీకి నిలబెడుతున్నారు.
కానీ, విజయనగరంలో మీసాల గీత రూపంలో పెద్ద అడ్డంకి ఏర్పడ్డది టీడీపీ అభ్యర్థి అయిన పూసపాటి అదితి కి. మీసాల గీత 2009 లో ప్రజా రాజ్యం తరుపున విజయనగరంలో పోటీ చేసి ఓడిపోయారు, వెంటనే కాంగ్రెస్లో జాయిన్ అయ్యి విజయనగరం మున్సిపల్ చైర్ పర్సన్ గా ఎన్నికయ్యారు. తరవాత 2014 లో టీడీపీలోకి జాయిన్ అయ్యి విజయనగరం ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయిన 2019 లో టీడీపీలో పోటీ చేసే అవకాశం తనకు రాలేదు తన స్థానంలో అశోక్ గజపతి రాజు కూతురు అయిన అదితికి అవకాశం ఇచ్చారు. అప్పటినుండి మీసాల గీత విజయనగరంలో కోట రాజకీయాలకు స్వస్థి చెబుతూ తనూ సొంతంగా విజయనగరంలో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసి అశోక్ గజపతి రాజు పెత్తనాన్ని ఎదిరించి నిలబడి నియోజకవర్గంలో టీడీపీ కార్యక్రమాలు నిర్వహించారు. తిరిగి 2024 కూటమిలో భాగంగా మళ్ళీ టీడీపీ టికెట్ అదితి గజపతి కి చంద్రబాబు నాయుడు కేటాయించడంతో అలిగిన మీసాల గీత తన అనుచరులతో మంతనాలు జరిపి టీడీపీ అభ్యర్ధి కి సపోర్ట్ చెయ్యను , తన భవిష్యత్ కార్యాచరణ త్వరలో ప్రకటిస్తా అని అన్నారు.
ఇప్పుడు మీసాల గీత విజయనగరంలో స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగాలి అని నిర్ణయం తీసుకొని తన అనుచరులతో కలిసి ప్రచారం మొదలు పెట్టారు. ఇప్పుడు అదే టీడీపీ పాలిట మరణ శాసనం అయింది. తనకు టికెట్ రాకపోవడానికి కారణం అశోక్ గజపతి రాజునే అని ప్రచారం చేస్తున్నారు మీసాల గీత. ఇప్పుడు గీత సపోర్ట్ చెయ్యకపోతే నియోజకవర్గంలో అదితి గజపతి మరొకసారి ఓడిపోవడం ఖాయమని తెలుస్తోంది. దీనితో విజయనగర రాజుల రాజకీయాలకు అంతం పలకడం ఖాయంగా కనిపిస్తుంది. మీసాల ‘ గీత ‘ దాటితేనే విజయనగర రాజుల వారసురాలికి విజయం దక్కవచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో అది జరగని పనిగా కనపడుతుంది.