ఎన్నికల్లో గెలవలేమని నారా లోకేష్ అడ్డదారులను తొక్కుతున్నారు. మంగళగిరిలో నారా లోకేష్ కు ప్రత్యర్థిగా వైసీపీ నుండి మురుగుడు లావణ్య పోటి చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. మంగళగిరిలో తను ఓడిపోతున్న విషయం అర్థమైన లోకేష్ నీచ స్థాయికి దిగజారి లావణ్య పేరుతో వున్న మరో ఇద్దరి మహిళల చేత స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేయించడం గమనార్హం. ఇందులో ఓ మహిళ ఇంటి పేరుతో సహా మురుగుడు లావణ్య కావడం విశేషం. ఇలా ఒకే పేరుతో నామినేషన్ వేపించి కొన్ని ఓట్లయిన వైసీపీకి దెబ్బ కొట్టాలని నారా లోకేష్ ప్లాన్ చేశాడు.రాజీవ్ గృహకల్పలో బంగారు ఆభరణాల పనిచేసే మురుగుడు సాంబశివరావు భార్య మురుగుడు లావణ్యతో గురువారం రోజున నామినేషన్ దాఖలు చేయించారు.
ఇదేవిధంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ ఓటమి భయంతో వైసీపీ అభ్యర్థి విడుదల రజనీ గెలుస్తున్నారని అదే పేరుతో గల ఒక దళిత మహిళ చేత బలవంతంగా ఒప్పించి నామినేషన్ పత్రాల మీద సంతకాలు తీసుకొని నామినేషన్ వేశాక తమిళనాడులోని వేళాంగిణి మాత గుడికి పంపిస్తాము ఎలక్షన్ అయ్యే వరకు అక్కడే ఉండేలా అన్ని ఖర్చులు భరిస్తామని టీడీపీ అభ్యర్ధి గల్లా మాధవి భర్త గల్లా రామచంద్ర రావు స్వయంగా మాట్లాడి, ఆమెను వారి ఇంటి నుండి బలవంతంగా తాము ఉండే అపార్ట్మెంట్ లోనే వేరే ఫ్లాట్ కు తరలించి నిర్బంధించారు. ఇలా ఆ మహిళను తీసుకువెళ్లడం చూసిన ఆమె తండ్రి దేవరాజ్ తన కూతురును ఎవరో కిడ్నాప్ చేసారు అంటూ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగరంపాలెం సీఐ లోకనాథం విచారణ ప్రారంభించి ఆమె ఎక్కడ ఉన్నారో కనిపెట్టి పోలీసు స్టేషన్ కు తీసుకువచ్చి తన కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ లీగల్ సెల్ నాయకులు పోలీస్ స్టేషన్ వద్ద గొడవ చేసి టీడీపీ వారి మీద కేసులు నమోదు చెయ్యాలని డిమాండ్ చేశారు. అయితే అప్పటికే సంతకాలు తీసుకున్న టీడీపీ నేతలు వాటిని ఎలక్షన్ రిటర్నింగ్ అధికారికి అందజేశారు. తనకు ఇష్టం లేకపోయినా బలవంతంగా టీడీపీ నాయకులు నామినేషన్ పత్రాల మీద సంతకాలు తీసుకున్నారు అని ఆ భాదిత మహిళ వీడియో రిలీజ్ చేశారు. ఈ గొడవల్లో నన్ను నా కుటుంబాన్ని లాగకండని విజ్ఞప్తి చేశారు.
ఇలా ఓటమీ భయంతో నారా లోకేష్ , టీడీపీ నాయకులు నీచ స్థాయికి దిగజారి ఒకే పేరుతో వున్న వారి చేత బలవంతంగా నామినేషన్ వేయించి వైసీపీ అభ్యర్ధుల ఓట్లను చీల్చే దుర్మార్గపు ఆలోచలనలకు తెరలేపారు అంటూ ఆయా నియోజకవర్గ ప్రజలు మాట్లాడుకుంటున్నారు.