2024 సార్వత్రిక ఎన్నికల ముందు విజయవాడ పార్లమెంట్ పరిధిలోని వివిధ పార్టీల రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వరసగా పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఈ రోజు గన్నవరం నియోజకవర్గం కేసరపల్లి నైట్ స్టే పాయింట్ వద్ద టీడీపీ , బీసీవై పార్టీ నేతలు ముఖ్యమంత్రి సమక్షంలో వైస్సార్సీపీలో చేరారు.
కేశినేని నాని తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్సీపీలో చేరిన తర్వాత ఒకటే నినాదంతో ముందుకు వెళ్తున్నాడు. విజయవాడ పార్లమెంట్ పరిధిలో తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తాను అని చాల సందర్భాల్లో చెప్పాడు. కేశినేని నాని ఆధ్వర్యంలో ఇటీవల జనసేన నగర అధ్యక్షడు పోతిన మహేష్ ను పార్టీలోకి తీసుకొని వచ్చాడు. ఈ రోజు టీడీపీ నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పెందుర్తి శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ కరీముల్లా, 40వ వార్డు టీడీపీ నేత, ప్రొఫెషనల్ వింగ్ జోనల్ కోఆర్డినేటర్ వెలగలేటి భార్గవ రాయుడు, ఎన్టీఆర్ జిల్లా ప్రొఫషనల్ వింగ్ జనరల్ సెక్రటరీ వసీం అక్రం, డివిజన్ అధ్యక్షుడు నీలం మనోజ్, ఎస్సీ విభాగం నేత ఎ అవినాష్ ఉన్నారు.
టీడీపీ నాయకులతో పాటు బీసీవై పార్టీ స్టేట్ కన్వీనర్ పట్టబోయిన శివ రామ కృష్ణ యాదవ్, ఆల్ ఇండియా యాదవ మహాసభ స్టేట్ ప్రెసిడెంట్ అంబటి నాగయ్య యాదవ్, బెజవాడ బార్ అసోసియేషన్ ట్రెజరర్ బి వెంకటేశ్వర్లు యాదవ్, యూత్ లీడర్ గోగుల విజయ్ కుమార్, అటోనగర్ టింబర్ మర్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బి నాగయ్య యాదవ్, బి అశోక్ యాదవ్, మార్కాపురం టీడీపి యూత్ కన్వీనర్ భూమిరెడ్డి నాగార్జున రెడ్డి, టింబర్ మర్చెంట్ అసోసియేషన్ సభ్యుడు చప్పిడి మల్లేశ్వర యాదవ్‌లు వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.