తనను తిట్టిన మేధావుల నోళ్లను డబ్బుతో మూయించడం తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి వెన్నతో పెట్టిన విద్య. కాకపోతే ఈసారి ఒకడుగు ముందుకేసి ఏకంగా అసెంబ్లీ టికెట్ ఇచ్చాడు. అతనే కొలికపూడి శ్రీనివాసరావు.. టీడీపీ తిరువూరు అభ్యర్థి.
ఈ స్వయం ప్రకటిత మేధావి ఇప్పుడంటే వైఎస్సార్ కాంగ్రెస్‌పై అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడు గానీ.. గతంలో ఆంధ్రప్రదేశ్ విద్యావంతుల ఐక్యవేదిక కన్వీనర్‌గా చంద్రబాబుపై ఒంటికాలిపై లేచిన సందర్భాలున్నాయి. 2014 – 19 మధ్య తెలుగుదేశం పాలనపై కొలికపూడి అనేక సందర్భాల్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోకి సీబీఐ, ఈడీని రానివ్వకుండా అడ్డుకోవడంపై మండిపడ్డారు. ఇంటికో ఉద్యోగం తదితర హామీల విషయంలో బాబు మోసం చేశాడని తిట్టిపోశాడు. ఏపీ ప్రజల్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిలువునా ముంచారని వ్యాఖ్యానించారు. ఓసారి టీవీ ఇంటర్వ్యూలో ‘నెలరోజుల క్రితం సుప్రీంకోర్టు అక్రమ సంబంధాలు నేరం కాదని తీర్పు ఇచ్చింది. ఆ విషయం చంద్రబాబు గురించే చెప్పిందని నేను భావిస్తున్నా. ఆయన 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని.. రాజకీయ వ్యభిచార యాత్రగా చొప్పుచ్చు. బాబు మార్చినన్ని రంగులు ఊసరవెల్లి కూడా మార్చి ఉండదు’ అన్నాడు.
ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీనికి కారణం లేకపోలేదు. బాబు, పవన్‌ను ఎన్నో తిట్టిన కొలికపూడి ప్రస్తుతం టీడీపీ నాయకుడు. తెలుగుదేశం – జనసేన – బీజేపీల తిరువూరు ఉమ్మడి అభ్యర్థి. ఇక్కడ ఇన్చార్జిగా ఉన్న శావత దేవదత్‌కు బాబు వెన్నుపోటు పొడిచి శ్రీనివాసరావుకు అవకాశం కల్పించారు.
2019 వరకు నారా వారిని ఇష్టమొచ్చిన తిట్టిన కొలికపూడికి ప్రస్తుతం ఆయన దేవుడిలా కనిపిస్తున్నాడు. ఫేక్ అమరావతి ఉద్యమంలో పాల్గొన్నాడు. ఎల్లో డిబేట్లలో చేరి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దుష్ప్రచారం చేశాడు. 2019 ఎన్నికల సమయంలో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి ప్రధాని నరేంద్రమోదీని వ్యక్తిగతంగా తిట్టి కాంగ్రెస్ పంచన చేరిన బాబు 2024 ఎన్నికలు వచ్చేసరికి మళ్లీ కమలం పార్టీ నీడలోకి వెళ్లాడు. కొలికపూడి దృష్టిలో ఇది రాజకీయ వ్యభిచారమే కదా.. నాడు నచ్చని ఈ ఊసరవెల్లి తనం ఇప్పుడెలా నచ్చింది మేధావి గారూ.. పవన్ ప్రజల్ని మోసం చేశాడని నాడు మీరే అన్నారు. ఇప్పుడు అదే వ్యక్తితో బాబు చేరినప్పుడు తప్పు అని చెప్పాలి కదా.. అలా కాకుండా సపోర్టు ఎందుకు చేస్తున్నారు. మీకు టికెట్.. డబ్బు ఇవ్వగానే టీడీపీ అధినేత మంచివాడైపోయాడా..