అమరావతి ఉద్యమం పేరుతో ఈ మధ్యకాలంలో బాగా ప్రచారంలోకి వచ్చిన వ్యక్తి కొలికిపూడి శ్రీనివాస రావు. పాదయాత్ర ఇతరత్రా కార్యక్రమాల ద్వారా పేరు తెచ్చుకున్న కొలికపూడి అమరావతి ఉద్యమంలో కీలకపాత్ర పోషించడమే కాకుండా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం వల్ల అతనికి కాలం కలిసి వచ్చింది. చంద్రబాబు అనుగ్రహం పొందడంతో పాటు రాజకీయ అరంగేట్రానికి దారులు పడ్డాయి. తదితర కారణాలను పరిగణనలోకి తీసుకున్న చంద్రబాబు తిరువూరు నియోజకవర్గం నుంచి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాడు. […]
తనను తిట్టిన మేధావుల నోళ్లను డబ్బుతో మూయించడం తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి వెన్నతో పెట్టిన విద్య. కాకపోతే ఈసారి ఒకడుగు ముందుకేసి ఏకంగా అసెంబ్లీ టికెట్ ఇచ్చాడు. అతనే కొలికపూడి శ్రీనివాసరావు.. టీడీపీ తిరువూరు అభ్యర్థి. ఈ స్వయం ప్రకటిత మేధావి ఇప్పుడంటే వైఎస్సార్ కాంగ్రెస్‌పై అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడు గానీ.. గతంలో ఆంధ్రప్రదేశ్ విద్యావంతుల ఐక్యవేదిక కన్వీనర్‌గా చంద్రబాబుపై ఒంటికాలిపై లేచిన సందర్భాలున్నాయి. 2014 – 19 మధ్య తెలుగుదేశం పాలనపై కొలికపూడి అనేక […]
తిరువూరు తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావుకు ప్రజల నుంచి నిరసన ఎదురైంది. ఆయన నియోజకవర్గంలో రోడ్ చేస్తూ ఓ చోట ఆపారు. ఈ సమయంలో ప్రజలు ఆయన్ను పట్టించుకోలేదు. ముఖ్యంగా మహిళలు ‘తెలుగుదేశం పోవాలి. మా ఓటు ఫ్యాన్ గుర్తుకే’ అని తెగేసి చెప్పారు. దీంతో అవాక్కయిన కొలకపూడి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే వారు ఒప్పుకోకపోవడంతో ప్రచార వాహన డ్రైవర్‌ను పద పద అంటూ పలాయనం చిత్తగించారు. శ్రీనివాసరావు మొదటి నుంచి వివాదస్పమైన వ్యక్తి. […]
ఏమైంది ఈ తెలుగుదేశం పార్టీకీ.. మంచి నేతలుగా పేరొందిన వాళ్ళను కూడా పక్కనబెట్టి సోషల్ మీడియాలో బూతులతో ట్రెండ్ అయి టీవీ డిబేట్లలో బహిరంగ దూషణలకు పాల్పడే వారికి టికెట్లు ఇచ్చే స్థాయికి ఆ పార్టీ ఎందుకు దిగజారిపోయింది? అభ్యర్థుల ఎంపికలో అసలు తప్పు ఎక్కడ జరుగుతుందనే చర్చ ఇప్పుడు టీడీపీ కేడర్ లో విస్తృతంగా జరుగుతుంది. టీడీపీ ప్రకటించిన తొలిజాబితాలో మహాసేన రాజేష్, కొలికపూడి శ్రీనివాసరావుకు టికెట్ కేటాయించిన టీడీపీ తాజాగా బాపట్ల ఎంపీ అభ్యర్థిగా […]
కొలికపూడి శ్రీనివాస రావు – గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గానికి చెందిన వ్యక్తి. 2019 ఎన్నికలకు ముందు వైసీపీ పేరిట టీవీ డిబేట్లలో పాల్గొని చంద్రబాబుని, రాజధాని అమరావతిని పలుమార్లు తీవ్రంగా విమర్శించిన వ్యక్తి . అయినా కానీ వైసీపీ పార్టీలో తగిన గుర్తింపు కానీ, ఆహ్వానం కానీ రాలేదు అని టీడీపీ ద్వారా మరింత రాజకీయ భవిష్యత్తు ఉండొచ్చు అనుకొన్నాడో ఏమో కానీ 2019 చివర్లో టీడీపీ అమరావతి ఉద్యమం మొదలెట్టగానే అందులో దూరి పోయాడు. […]
చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరిన ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితీ అధ్యక్షుడు, అమరావతి ఉద్యమ నేత కొలికపూడి శ్రీనివాసరావు అంటూ ఓ వార్త పచ్చమీడియాలో చక్కర్లు కొడుతుంది.. ముందు నుండి చంద్రబాబు స్క్రిప్ట్ తూచా తప్పకుండా మీడియా ముందు చదివి వినిపించే కొలికపూడి ఇప్పుడు కొత్తగా టీడీపీ పార్టీ కండువా కప్పుకోవడం ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది. రాజధాని విషయంలో చంద్రబాబు డైరెక్షన్ లో ఈ కొలికపూడి నడిచాడు. కొలికపూడి మొదటి నుండి టీడీపీ మద్ధతుదారు అనే పేరుంది. […]
తరచూ టీవీ డిబేట్లలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసే కొలికపూడి శ్రీనివాసరావు నేడు సీఐడీ విచారణకు హాజరు కానున్నారు. రాంగోపాల్ వర్మ తల నరికి తెస్తే కోటి రూపాయలు ఇస్తానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా నిలిచిన సంగతి తెలిసిందే. కాగా తనను హత్య చేసేందుకు బహిరంగంగా ఓ టీవీ ఛానెల్ సాయంతో సుపారీ ఇచ్చారని ఏపీ సీఐడీ కి రామ్ గోపాల్ వర్మ పిర్యాదు చేసారు. దాంతో అప్పటినుండి కొలికిపూడి పరారీలో ఉన్నారు. తాజాగా కొలికిపూడి ఇంటికి […]
ఈయన అమరావతి రైతుల తరపున ఉద్యమ నాయకుడిగా వెలుగులోకి వచ్చాడు. APJAC (ఆంధ్రప్రదేశ్ జాయిన్ యాక్షన్ కమిటీ) సభ్యుడుగా ఉన్న కొలికపూడి మూడు రాజధానులు వద్దు, అమరావతి ముద్దు అని బాగా పోరాటం చేశాడు. ఈయన బాగా పాపులర్ అయ్యింది మాత్రం బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి మీద ఒక టీవీ డిబేట్ లో చెప్పుతో దాడి చెయ్యడం తరవాత అని చెప్పుకోవచ్చు. ఈయన తర్వాత టీడీపీ తరపున టీవీ డిబేట్లలో పాల్గొంటూ ఆ పార్టీ మిద […]
కొలికపూడి శ్రీనివాసరావు.. పెయిడ్ అమరావతి ఉద్యమంలో ఉన్న వ్యక్తి. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్న స్వయం ప్రకటిత మేధావి. ఎల్లో చానల్స్‌లో తెలుగుదేశం, చంద్రబాబు నాయుడి తరఫున మాట్లాడుతూ అధికార పార్టీపై ఇస్తానుసారంగా ఆరోపణలు చేస్తుంటారు. చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై నోరు పారేసుకున్నారు. ఇక వైఎస్ఆర్సీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులపై నోటికి అడ్డూ అదుపూ లేకుండా మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. కొద్దిరోజులుగా మెయిన్ […]
రాం గోపాల వర్మ తల నరికి తెచ్చిచ్చిన వాడికి కోటి రూపాయలు ఇస్తానంటూ ఓ టీవీ ఛానెల్ డిబేట్ లో కొలికపూడి శ్రీనివాసరావు అనే వ్యక్తి తీవ్ర వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఎవరు ఇతను, ఒక వ్యక్తి తల నరికి తెస్తే కోటి రూపాయలు ఇస్తాననే తెంపరితనం ఎక్కడి నుండీ వచ్చింది. హత్యలు చేస్తే కోట్లు ఇచ్చే స్థాయి అతనికి ఉందా. చట్టాల్ని, వ్యవస్థల్ని తృణప్రాయంగా చూస్తూ బహిరంగంగా తలలు నరకమని ప్రోత్సాహించే ధైర్యం అతనికి ఎవరు […]