వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కోడి కత్తి డ్రామా ఆడారు. తనే వైఎస్సార్సీపీ కార్యకర్త అయిన శ్రీనుకు డబ్బులిచ్చి పొడిపించుకున్నాడు. ఇలా చేస్తే సింపతీ వస్తుందని ఎన్నికల వ్యూహకర్త, బిహార్ డెకాయిట్ ప్రశాంత్ కిశోర్ చెప్పాడు. ఆ ఘటనలతో తెలుగుదేశానికి ఎటువంటి సంబంధం లేదు’ గతంలో చంద్రబాబు నాయుడి మాటలివి.
కట్ చేస్తే.. నిందితుడు శ్రీను, అతని కుటుంబం గురువారం చంద్రబాబును కలిశారు. అంబాజీపేటలో హెలిపాడ్ వద్ద ప్రత్యేక బస్సులో వాళ్లంతా బాబను కలిసి చాలాసేపు మాట్లాడారు. దీనిని బట్టి జగన్‌ను అంతమొందించడానికి ఎల్లో గ్యాంగ్ కుట్ర పన్నిందని మరోసారి స్పష్టమైంది. బాబే ఆ ఘటన వెనుక ఉన్న వ్యక్తి అని అర్థమవుతోంది. పైకి ఆ కుటుంబానికి అండగా ఉండేందుకని చెబుతున్నా.. విషయం వేరే ఉందని తెలుగు తమ్ముళ్లే చెబుతున్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం అడ్డదారులన్నీ తొక్కుతున్న బాబు శ్రీనును కూడా వాడుకోవాలని చూస్తున్నాడు. తమ హస్తం లేదని చెబుతూనే అతనికి అండదండగా ఉన్నారు. ఆనాడు ప్రశాంత్ కిశోర్ ఆడిస్తున్న డ్రామా అని మొరిగి, నేడు ఆ వ్యూహకర్త చేతే జగన్‌పై అభాండాలు వేయిస్తున్నాడు బాబు.
2018 అక్టోబర్ 25వ తేదీన అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో హత్యాయత్నం జరిగింది. జనుపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి ఈ కేసులో ప్రధాన నిందితుడు. ఇతను ఎయిర్‌పోర్టులో టీడీపీ గాజువాక నేత హర్షవర్ధన్ చౌదరికి చెందిన ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్లో పనిచేసేవాడు. యలమంచిలికి చెందిన టీడీపీ నేత సుందరపు విజయ్‌కుమార్ సిఫార్స్ మేరకు హర్షవర్ధన్ తన రెస్టారెంట్లో చేర్చుకున్నాడు. శ్రీనివాస్ పాతనేరస్తుడు. ఇతడికి హర్షవర్ధన్నో అబ్జక్షన్ సర్టిఫికెట్ ఇప్పించాడు. జగన్‌ను హత్య చేసే కుట్రలో ఎల్లో పెద్ద తలకాయలు ఉన్నట్లు అప్పుడే అందరూ గ్రహించారు.
హర్షవర్ధన్ చౌదరి నారా లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడు. 2014లో ఎన్నికల్లో గాజువాక నుంచి టీడీపీ టికెట్ ఆశించాడు. ఆయన 2017లో విమానాశ్రయంలో రెస్టారెంట్ కాంట్రాక్టు దక్కించుకున్నాడు. ఆ సమయంలో టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. అయితే హత్యాయత్నం జరిగాక టీడీపీ కుట్రలకు తెరతీసింది. ఎన్నికల్లో సానుభూతి కోసం జగన్ ఆడుతున్న నాటకమంటూ దుష్ప్రచారానికి దిగింది. నిందితుడు వైఎస్సార్సీపీ సానుభూతిపరుడని ఫ్లెక్సీలు రూపొందించి తప్పుడు ప్రచారం చేశారు. కేసును పక్కదారి పట్టించేందుకు టీడీపీ, ఎల్లో మీడియా అనేక ప్రయత్నాలు చేసింది. కోడి కత్తితో పొడిస్తే చనిపోతారా అంటూ గతంలో టీడీపీ నాయకులు, పవన్ కళ్యాణ్ వ్యంగ్యంగా చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కోడి కత్తి జగన్ అంటూ దిగజారి మాట్లాడారు. శ్రీనివాస్‌కు బెయిల్ రావడంలో తెలుగుదేశం పెద్దల హస్తం ఉందనేది వాస్తవం.
ఎన్నికల నేపథ్యంలో శ్రీనివాస్ ద్వారా తప్పుడు ప్రచారం చేయించి లబ్ధి పొందాలనేది చంద్రబాబు ప్లాన్‌గా తెలుస్తోంది. అతను బెయిల్‌పై విడుదలైనప్పుడు జగన్‌కు సానుభూతి తీసుకొచ్చేందుకు చేయలేదని స్పష్టంగా మీడియాకు చెప్పాడు. కానీ బాబు దీనిని మార్చి చెప్పాలని తాజా మీటింగ్‌లో చెప్పినట్లు తెలిసింది. తాను అధికారంలోకి వస్తే ఏ పనికావాలన్నా చేస్తానని అన్నట్లు సమాచారం. ఇప్పుడు కూడా అబద్ధాలు చెప్పేందుకు డబ్బు అందజేసినట్లు ప్రచారం జరుగుతోంది.
అధికారం కోసం నారా వారు ఎంతకైనా దిగజారుతాడని మరోసారి తేటతెల్లమైంది. ప్రజల మనసుల్లో స్థానం సంపాదించి గెలవలేక జగన్‌ను లేకుండా చేద్దామనుకున్నాడు. అది వర్కౌట్ కాకపోయే సరికి దుష్ప్రచారానికి దిగాడు. బాబు ఆనాడు శ్రీనివాస్‌ను వైఎస్సార్సీపీ కార్యకర్త అన్నాడు. కానీ అతడికి అన్ని విధాలుగా అండగా నిలిచించి టీడీపీనే. ఇప్పుడు నేరుగా కలిసి మాట్లాడుకున్నారు. ప్రశాంత్ కిశోర్ ఆడించిన డ్రామా అన్నారు. అతను ప్రస్తుతం తెలుగుదేశం కోసమే పనిచేస్తున్నాడు. వేళ్లన్నీ చంద్రబాబు వైపే చూపిస్తున్న నేపథ్యంలో నో.. నో.. అయామ్ ఖండిస్తున్నానంటే ఎవరూ నమ్మరు.