చంద్రబాబు తన రంగుని ఎప్పుడు ఎలా మారుస్తాడో ఎవరికీ తెలియదని మాజీ మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి టీడీపీ జనసేన కూటమిగా పోటీ చేసి నాలుగు సంవత్సరాలు కూడా కలిసి ఉండకుండా విడిపోయి 2019 ఎన్నికల ముందు బిజెపి పైన జనసేన పైన ఎన్నో విమర్శలు చేశాడు. 2019 ఎన్నికల ముందు ముస్లింలు, క్రైస్తవులకు బిజెపి తీవ్ర అన్యాయం చేసిందంటాడు. మోడీ గోద్రాలో 2000 మంది ముస్లింలను చంపిన ద్రోహి, వాళ్లకి ఓటేస్తే పాపం అన్నాడు . మళ్ళీ 2024 ఎన్నికలకు తిరిగి బిజెపితోనే జత కడతాడు. గత ఎన్నికల్లో మోదీని వ్యక్తిగతంగా తిట్టాడు ఇప్పుడు మోడీ గొప్పోడంటాడు. రాజకీయంగా ఆర్థికంగా తాను బాగుపడాలన్నదే చంద్రబాబు ఆలోచన. మోడీ న అడ్డం పెట్టుకొని ఏసీల నుంచి తప్పించుకోవాలని చంద్రబాబు చూస్తున్నాడని ఈ సందర్భంగా తెలిపాడు. చంద్రబాబు అధికారంలోకి రావడానికి ఎంత నీచనికైనా దిగుజార్తాడని ఎవరు కాలైనా నాకుతాడని అన్నారు.
2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి విజయం సాధించి రెండోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధంగా ఉన్నాడని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ఈమధ్య జరిగిన సిద్ధం సభల్లో మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటేయమని అడుగుతున్నాడు, ఇదే మాట 14 సంవత్సరాలు అధికారంలో ఉన్న చంద్రబాబు ఆ విధంగా అడిగే దమ్ముందా అని అడిగారు. జనసేన బిజెపి టిడిపి టిడిపి కలిసి పోటీ చేసిన వైఎస్ఆర్సిపి ని ఓడించలేరని, ఈ కూటమిని చిత్తుచిత్తుగా ఓడించాలని, తుప్పు పట్టిన సైకిల్ ని రాబోవు ఎన్నికల్లో ఓడించి బురదలో పడేయాలని ప్రజలని కోరారు.