తెలుగుదేశం, జనసేన విడుదల చేసిన మేనిఫెస్టోకు భారతీయ జనతా పార్టీ ఆమోదం లేదు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌పై నమ్మకం లేక హస్తిన పెద్దలు దూరం జరిగారు. ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్లో ఇదే హాట్‌టాపిక్‌గా ఉంది. మేనిఫెస్టో పత్రాన్ని పట్టుకునేందుకు బీజేపీ పరిశీలకుడు సిద్ధార్థనాథ్ సింగ్ ఒప్పుకోలేదు. ఏపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి అయితే అసలు సీన్లోనే లేరు. దీంతో కూటమిలోని పార్టీల మధ్య లుకలుకలు ఒక్కసారిగా బయటపడ్డాయి. వాస్తవానికి చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ కాంగ్రెస్‌ది. […]
2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కూటమి మేనిఫెస్టోపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు కూటమి మేనిఫెస్టో విడుదల చేస్తామని ముందుగానే ప్రకటించారు, కానీ మూడు గంటల సమయం కావస్తున్నా వేదికపైకి ఎవరు రాకపోయేసరికి జర్నలిస్టులు విస్తుపోయారు. ఈ సమావేశానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హాజరవుతారని ప్రకటించారు. కానీ మూడు గంటలు అవుతున్నా […]
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ ఎన్డీయే కూటమి మధ్య మాటల యుద్దం సాగుతోంది. అదే సమయంలో ఎన్డీయే కూటమిని వైసీపీకి ధీటుగా తయారుచేసేందుకు పవన్ కళ్యాణ్ చేసిన ప్రయత్నాలపైనా రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. చంద్రబాబుకు ఇష్టం లేకపోయినా బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిదంటూ టీడీపీ నేతలు కూడా అక్కడక్కడా వ్యాఖ్యానిస్తున్నారు. బీజేపీతో పొత్తు కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ప్రయత్నాలను ఆ పార్టీ కైకలూరు అభ్యర్ధి, మాజీ […]
ఈ నెల 17వ తేదీ జరిగిన ప్రజాగళం సభ ఫెయిల్యూర్ ని పోలీసులపై నెట్టేందుకు టీడీపీ, జనసేన ప్రయత్నించింది.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభ ఫెయిల్యూర్‌పై ఫిర్యాదు చేసిన టీడీపీ, జనసేనకు ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. పరిధిలో లేని అంశంపై తమకు ఫిర్యాదు చేశారని సీఈవో ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. బీజేపీ, టీడీపీ, జనసేన సభ విఫలం కావడానికి పోలీసులే కారణమంటూ గగ్గోలు పెట్టింది.సభలో మైకులు పని చేయకపోవడనికి, ఫ్లడ్డ్ లైట్ స్టండ్ల పైకి […]
పొత్తు విషయంలో భారతీయ జనతా పార్టీ నుంచి ఇంకా క్లారిటీ లేదు. ప్రకటించిన సీట్లపై ఆగ్రహ జ్వాలలు చల్లారలేదు. రాష్ట్రంలోని ఏ నియోజకవర్గంలోనూ తెలుగుదేశం – జనసేన నేతలు, కార్యకర్తల మధ్య సఖ్యత లేదు. ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏదో ఒకటి చేయకపోతే ప్రజలు పట్టించుకోరనే భయంతో కూటమి తొలి ఉమ్మడి సభను తాడేపల్లిగూడెం సమీపంలోని ప్రత్తిపాడు వద్ద బుధవారం నిర్వహిస్తున్నారు. దీనికి ఇరు పార్టీల పేరు కలిసొచ్చేలా తెలుగు జన జెండా అంటూ పేరు […]
టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థులని ప్రకటించిన నేపథ్యంలో నిన్న విశాఖపట్టణంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో కేఏ పాల్ మాట్లడుతూ టీడీపీ జనసేన పొత్తుకు కాపులు వ్యతిరేకం అని తెలిపారు. వంగవీటి రంగాను హత్య చేయించిన చంద్రబాబుతో జత కట్టడం ఏంటి అని ప్రశ్నించారు. కాపులని చంద్రబాబు దగ్గర తాకట్టు పెట్టడానికి పవన్ కళ్యాణ్ ఎవరు అని దుయ్యబట్టాడు . డిసెంబర్ 25నే తాను జనసేనకు 24 సీట్లు టీడీపీ పార్టీ ఇస్తుంది అని తెలిపాను […]
గడ్డిపరక ఎగిరొస్తే, ఎందుకైనా పనికొస్తుందని దానితో కూడా పొత్తు పెట్టుకునే స్థాయికి వచ్చింది చంద్రబాబు రాజకీయం. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా అభ్యర్థుల వివరాలు విడుదల చేసి, మరికొన్నిటిని బీజేపీ పొత్తు కోసం అట్టే పెట్టి ఉంచిన చంద్రబాబు, బీజేపీ నుంచి పొత్తు సంకేతాలు వచ్చి పంతొమ్మిది రోజులైనా ఇంకా పిలుపురాలేదిమిటా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. “ప్రతి సీటు గెలవాల్సిందే, అందరినీ కలుపుకుని సాగండి” అని తెలుగు తమ్ముళ్ళకు, జనసైనికులకు పిలుపునిచ్చినా… వాళ్ళెవరూ […]
విశాఖపట్నంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ నిన్న ప్రకటించిన టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల ప్రకటనలో సామాజిక న్యాయం శూన్యం అని తెలిపారు. బీసీల పార్టీ తమది అని చెప్పుకునే టీడీపీ పార్టీ బీసీల కోసం ఎన్ని సీట్లు ప్రకటించిందో చూడాలి అన్నారు. 2014 నుంచి 2019 దాకా 50 శాతం ఉన్న బీసీలకు కేవలం ఒకటి రెండు పదవులు ఇచ్చి వంద పదవులు ఇచ్చినట్లు బిల్డుప్ ఇచ్చారు. ఎస్సి రిజర్వడ్ […]
విక్రమార్కుడు సినిమాలో రవితేజ, బ్రహ్మానందం దొంగతనాలు చేస్తుంటారు. జనాన్ని మోసం చేసి గుండ్లు కొట్టగా వచ్చిన 20 వేల రూపాయలకు పైగా నగదు పంచుకునేందుకు కూర్చొంటారు. ఆ సమయంలో కొంత డబ్బు పక్కన పెట్టి రౌండ్ ఫిగర్ అంటూ ఒక లాజిక్ చెప్పి రవితేజ.. బ్రహ్మిని మోసగిస్తాడు. ఇద్దరం కలిసి కష్టపడ్డాం కాబట్టి పది వేలు.. పది వేలు నాకని అంటాడు. వెంటనే బ్రహ్మికి ఇచ్చిన ఆ పదివేలు తీసుకుని సగం గుండ్లు నేను కొడితే.. మిగతా […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడు ఎక్కడా చూడని విచిత్ర రాజకీయాలకి వేదికగా మారుతోంది. 175 స్థానాలు గెలుపే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ దూసుకుపోతుంటే. ప్రతిపక్షాలు మాత్రం పొత్తులు పెట్టుకుని అంతర్గత కుమ్ములాటలతో వార్తల్లోకి ఎక్కుతున్నారు. ఇప్పటికే జనసేన టీడీపీ పొత్తు పెట్టుకున్నా కింద స్థాయి కార్యకర్తలు మాత్రం కలవలేక నిత్యం కుమ్ములాడుకోవడం కనిపిస్తూనే ఉంది. అయితే ఇప్పుడు అది కార్యకర్తల స్థాయి నుండి అధినేతల స్థాయికి చేరింది. ఈ గందరగోళానికి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తెరలేపినట్టు కనిపిస్తుంది. 75వ […]