ఏపీలో అభ్యర్థులు ఎంపికలో “కాపు సామాజిక వర్గానికి” కనీస ప్రాధాన్యత కల్పించకపోవడంపై రాష్ట్ర బీజేపీ అధినాయకత్వంపై కాపులు మండిపడుతున్నారు. ఈ విషయాన్ని కాపు నేతలు ఉటంకిస్తూ ఘాటు లేఖ రాశారు.. ఆ లేఖలో ఏముందంటే
గతంలో బీజేపీ అగ్ర నాయకత్వము రాష్ట్రములో “కాపు సామాజిక” వర్గానికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ.. కేవలం ఓట్లకు మాత్రమే పరిమితం చేయకుండా ఒక రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా తీర్చిదిద్ది, కాపులను అభివృద్ధి పథంలో నిలపాలని కొన్ని నిర్ణయాలు తీసుకుంది. దానికి నిదర్శనం రెండు పర్యాయాలు కాపు సామాజిక వర్గానికి చెందిన కన్నా లక్ష్మీ నారాయణ గారి, సోము వీర్రాజు గారిని బిజెపి పార్టీ అధ్యక్షులుగా నియమించింది. తాజాగా పొత్తులో బాగంగా ఏపీలో బీజేపీకి 6 ఎంపీ , 10 ఎమ్మెల్యే సీట్లను కేటాయించారు.
ఇందులో ఏపీలోని కాపు సామాజిక వర్గ నేతలకు ఈ 2024 సార్వత్రిక ఎన్నికలలో ఒక్క MLA & MP సీటు కూడా ఇవ్వకపోవడం విచారకరం. ఇది ఎవ్వరి తప్పు. ఏపీలో కాపు, బలిజలు 23 శాతం ఉన్నారు . అదేవిధంగా శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గంలో 16 శాతం కాపు, బలిజ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లున్నారు. శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ సునాయాసంగా గెలిచే సీటు. కావున డిల్లీ బీజేపీ పెద్దలు కాపుబలిజ సామాజిక వర్గాన్ని గుర్తించి శ్రీకాళహస్తి నియోజకవర్గానికి పొత్తుల్లో భాగంగా బీజేపీకి ఎమ్మెల్యే సీటు కేటాయింపు చేయాలని కోరుతున్నాం.
ఆంధ్రప్రదేశ్ బీజేపీలో కాపులకు జరుగుతున్న అన్యాయంపై ఇప్పటికైనా అధిష్టానం పెద్దలు దృష్టి సారించి బీజేపీ పార్టీ మీద! ఈ రాష్ట్రములో కాపు సామాజిక వర్గానికి ఉన్న నమ్మకాన్ని నిలబెట్టాలని నేను ఆశిస్తున్నాను.
– కోలా ఆనంద్.
రాష్ట్ర బీజేపీ కార్యదర్శి, శ్రీకాళహస్తి అసెంబ్లీ బీజేపీ పార్టీ కన్వీనర్.
కాగా ఈ లేఖపై రాష్ట్ర బీజేపీ నాయకులు స్పందించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.