జగన్ వచ్చాక ప్రజలు నిరుద్యోగులు అయ్యారు అనేది ఆయనే, జగన్ పథకాల వల్ల సోమరిపోతులు అయ్యారు అనేది ఆయనే. కాకపోతే రెండూ నిజాలు కాదు. అధికారిక లెక్కలు అబద్ధం ఆడవు… జాబు రావాలంటే బాబు రావాలి, ఇంటికో ఉద్యోగం, లేకుంటే నిరుద్యోగ భృతి అంటూ కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత జాబులు అడిగితే జాబిస్తానని నేనెప్పుడూ అనలేదే అని ప్లేటు పిరాయించాడు. పోనీ నిరుద్యోగభృతి ఇచ్చాడా అంటే దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.
బాబు ఐదేళ్ల పాలనలో మొత్తం గా కల్పించిన ప్రభుత్వోద్యాగాలు కేవలం 34 వేలు మాత్రమే. అదే జగన్ సీఎం అయిన ఆరునెల్లలు తిరక్కుండానే గ్రామ సచివాలయాల వ్యవస్థను సృష్టించి ఏకంగా 1.36 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాడు. మొన్న మొన్న వరకు ఇవసలు ఉద్యోగాలే కాదన్నట్టు గా ప్రవర్తించిన బాబు అండ్ కో, వాలంటీర్లు ఇంటివద్దకే వెళ్లి పెన్షన్ ఇవ్వకూడదని ఈసి ద్వారా అడ్డుపుల్ల వేసి అది తమ పార్టీ కూసాలు కదిలించడం తో డ్యామేజ్ కంట్రోల్ లో భాగంగా ఈ ఉద్యోగుల ద్వారా పెన్షన్ ఇంటినికి పంపిణి చేయించాలని అన్నాడు. జగన్ హయాంలో ప్రభుత్వ ఉద్యోగాలే ఇవ్వకపోతే మీరు ఎవరిని వాడుకుని పెన్షన్ ఇవమ్మన్నారు? పోనీ ఆ వ్యవస్థ ను కూడా నేనే తెచ్చా, వాళ్లందరూ నా హయాంలో ఉద్యోగాలు పొందిన వారే అని చెప్పుకునే స్కీం ఏమైనా ఉందా బాబు అని ఒకవేళ అధికార పక్షం అడిగితే ఆయన దగ్గర సమాధానం ఉండదు.
కేవలం సచివాలయ ఉద్యోగాలే కాదు. రెండు సార్లు గ్రూప్-1 నోటోఫికేషన్ ఇచ్చిన ఘనత సీఎం జగన్ ప్రభుత్వానిది. కేవలం 9 నెలల కనిష్ట సమయంలోనే నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ ప్రక్రియ కూడా పూర్తి చేసి యూపీఎస్సీ ని మించిన వేగంతో నియామకాలు చేపట్టిన ఘనత ఈ ప్రభుత్వానిది. అలాగే, గ్రూప్-2 లో దాదాపు 900 పోస్టులు విడుదల చేసి ప్రిలిమినరీ పరీక్ష పూర్తి చేసి ఫలితాలు విడుదల చేసారు. ఇలా దాదాపు అన్ని రకాల ఉద్యోగాలను శరవేగంగా భర్తీ చేసిన ఘనత ఈ ప్రభుత్వానిది.
బాబు హయాంలో ఇచ్చిన మొత్తం ఉద్యోగాల కంటే జగన్ ప్రభుత్వ హయాంలో ఈ 5 ఏళ్లలో కేవలం వైద్య ఆరోగ్య శాఖలో భర్తీ చేసిన ఉద్యోగాలే 20 వేలు ఎక్కువ. వారిలో:
స్పెషలిస్ట్ డాక్టర్లు-4,324,
మెడికల్ ఆఫీసర్లు-2,475,
స్టాఫ్ నర్సులు-6,734,
ఏఎన్ఎంలు-13,540,
మల్టీలెవల్ హెల్త్ ప్రొవైడర్లు-10,032,
పారా మెడికల్ సిబ్బంది-9,751,
క్లాస్ 4-3,303,
డేటా ఎంట్రీ ఆపరేటర్లు-249,
కొత్త మెడికల్ కాలేజీల్లో సిబ్బంది-1,582,
ఆయుష్ విభాగం లో -136
ఇతరులు-1,476,
మొత్తం పోస్టులు-53,602..
ఇవి వైద్య ఆరోగ్య శాఖలో ఇప్పటికే నియామకాలు పూర్తి చేసుకున్న ఉద్యోగాల సంఖ్య. ప్రభుత్వ ఉద్యోగాలు దండగ, ప్రభుత్వ ఉద్యోగులు సోమరిపోతులు, వారికి వేలకు వేలు జీతాలు దండగ అని హేళన చేసే బాబు, కేవలం 34 వేల ఉద్యోగాల కల్పన చేసిన బాబు, చిత్తశుద్ధితో 2.5 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు చేపట్టిన జగన్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం లేదని విమర్శించడం హాస్యాస్పదం.