2014 ఎన్నికల కాలంలో ఆంధ్రప్రదేశ్ ని సింగపూర్, జపాన్, జర్మనీ చేస్తానని ఊదరగొట్టిన చంద్రబాబు ఈ సారి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ని అమెరికా చేస్తానని చెప్పబోతున్నాడా?. ఏమో చెప్పినా చెప్పొచ్చు అనిపిస్తుంది రెండు రోజుల క్రితం టీడీపీ ఆఫీషియల్ పేజీలో వచ్చిన ఉచిత బస్సు ప్రయాణం పోస్టర్ చూస్తే.
ముందు మనం left hand drive, right hand drive ల మద్య వత్యాసం తెలుసుకొందాం.
ఏదైనా ఫోర్ వీలర్ కానీ, హెవీ వెహికల్స్ కానీ డ్రైవర్ ఎడమ వైపున కూర్చొనే ఏర్పాటు ఉంటే లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ అంటారు. ఇలా లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్ సిస్టం ఉన్న దేశాల్లో వెహికల్స్ రోడ్ కి రైట్ సైడ్ లో ప్రయాణం చేస్తాయి.
ఉదాహరణ : అమెరికా
అదే డ్రైవర్ వెహికల్ లో కుడి వైపున కూర్చొనే ఏర్పాటు ఉంటే రైట్ హ్యాండ్ డ్రైవ్ అంటారు. ఇలా రైట్ హ్యాండ్ డ్రైవ్ వెహికల్స్ రోడ్ లెఫ్ట్ సైడ్ లో ప్రయాణం చేస్తాయి.
ఉదాహరణ : ఇండియా.
ప్రపంచంలో అధిక దేశాలు లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ ని అమలు చేస్తుండగా, మన భారత దేశం మరి కొన్ని దేశాలు మాత్రం రైట్ హ్యాండ్ డ్రైవ్ ని అమలు చేస్తున్నాయి
అయితే టీడీపీ ఆఫీషియల్ పేజీలో వచ్చిన మహిళలకు ఉచిత ప్రయాణం బస్సు ఇమేజ్ చూస్తే దాంట్లో డ్రైవర్ స్థానం లెఫ్ట్ లో ఉండటం గమనార్హం . అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డ్రైవింగ్ అన్నమాట. ఇలా లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ చేసే ఉచిత బస్సుల వారు రోడ్ కి రైట్ సైడ్ లో వాహనం నడుపుతారు. దేశంలో మిగతా వాహనాలాన్ని రోడ్ కి లెఫ్ట్ సైడ్ లో వెళ్తుంటే ఈ ఉచిత బస్సుల వాళ్ళు రైట్ సైడ్ ప్రయాణం మొదలు పెడితే నిమిషంలో అన్ని వాహనాలు ఎదురు వచ్చే వాహనాలు గుద్దుకొని రాష్ట్రంలో మహిళల్లో అత్యధిక శాతం హాస్పటల్లో పడటం ఖాయం .
అలాంటి పిచ్చి పని బాబు గారు చేస్తారా, లేదు లేదు. ఆయన మన రాష్ట్రాన్ని అమెరికా సరసన నిలబెట్టాలి అన్న సంకల్పంతోనే ఈ నిర్ణయం తీసుకోని ఉంటారు. ఏమో రేపు టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో ఈ అంశం కూడా ఉండొచ్చు.