‘అది అమలు చేయలేని మేనిఫెస్టో. నేను మొదటి నుంచి చెబుతూనే ఉన్నాను. వాళ్లు ప్రామిస్ చేసేదానికి బీజేపీ పాలసీస్కు క్లారిటీ లేదు. ఎక్కడో ఒక చోట ఉమ్మడి మేనిఫెస్టో పెట్టుకుని ముందుకు పోకపోతే ఆ తర్వాత ఇబ్బంది అవుతుందన్నాను. కానీ జరగలేదు. మేనిఫెస్టోకు మేం దూరంగా ఉన్నట్లుగానే బిహేవ్ చేశారు. మంచిది. అది టీడీపీ, జనసేనదిగానే వెళ్తోంది. మా మద్దతు ఉంటుందనేది జస్ట్ మాటంతే’ ఏపీ మాజీ సీఎస్, బీజేపీ నాయకుడు ఐవైఆర్ కృష్ణారావు ఓ మీడియా […]
కాగా ఈ మేనిఫెస్టో ప్రకటించిన మొదల్లో పెన్షన్ సూపర్ సిక్స్ లో ఉండేది, కానీ మేనిఫెస్టో ప్రకటించిన రెండు రోజుల నుంచి వార్తాపత్రికల్లో ఇస్తున్న ప్రకటనలు సూపర్ సిక్స్ నుంచి పెన్షన్ ని దూరం చేశారు.
చంద్రబాబు అట్టహాసంగా విడుదల చేసిన టీడీపీ 2024 ఎన్నికల మానిఫెస్టో ఒక అబద్దాల పుట్ట, కాపీల కట్ట తప్ప మరొకటి కాదని ప్రచారం జరుగుతుంది. తెలుగుదేశం 2014 మానిఫెస్టోను ఏ విధంగా ఎన్నికల తరువాత చెత్తబుట్టలో పడేసిందో ఈ మానిఫెస్టో గతి కూడా అంతే అనే వాదన ప్రజల్లో మొదలైంది. చంద్రబాబు ఇచ్చిన హామీలు చూస్తే ఒక్కటి కూడా చిత్తశుద్దితో ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఇచ్చినట్టుగా లేవని, కేవలం అధికారం కోసం జగన్ పధకాలను ఇతర రాష్ట్ర […]
2024 సార్వత్రిక ఎన్నికలకి సంబంధించి కూటమి నేతల మేనిఫెస్టో విడుదల తర్వాత సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. కూటమి మేనిఫెస్టోకి బీజేపీ అండ లేకపోవడం ఏంటని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ మేనిఫెస్టోలో బీజేపీ భాగస్వామ్యం ఎందుకు లేదో ప్రజలకి వివరించాలని వెల్లడించారు. కూటమినేతల చెబుతున్నట్లు బీజేపీ జాతీయస్థాయిలో మేనిఫెస్టో ప్రకటించినప్పటికీ ఆంధ్రప్రదేశ్ కి స్పష్టమైన హామీ ఎందుకు ఇవ్వలేదని ధ్వజమెత్తారు. బీజేపీ పలు […]
2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కూటమి మేనిఫెస్టోని విడుదల చేసింది. కూటమిలో భాగంగా బీజేపీ టీడీపీ జనసేనలు భాగమైన విషయం అందరికీ తెలిసిందే, కానీ మేనిఫెస్టోలో మాత్రం బీజేపీకి సంబంధం లేదు అంటూ ఆ పార్టీ నేతలు ప్రకటన చేశారు. అమలు గాని హామీలు చంద్రబాబు మేనిఫెస్టోలో పెట్టడంతో అవి అమలు పరచకపోతే బీజేపీకి ఎక్కడ చెడ్డ పేరు వస్తుందో అని భావించి మొదట్లోనే తప్పుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం పడుతున్నారు. ఒక చిన్న విశ్లేషణ చూద్దాం, […]
కూటమి మేనిఫెస్టో తర్వాత మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో సమావేశం నిర్వహించారు. పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ 2014లో టీడీపీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ అప్పట్లో ఉమ్మడి మేనిఫెస్టోకి అంగీకారం తెలిపింది. ఆ మేనిఫెస్టోలో చంద్రబాబు రైతుల రుణాలు మాఫీ, డ్వాక్రా రుణాలు మాఫీ, యువతకు జాబులు అంటూ పలు హామీలు ఇచ్చారు. 2014లో అధికారంలోకి వచ్చాక ఒక్క హామీ కూడా నెరవేర్చకుండానే మేనిఫెస్టోను తమ అధికారిక వెబ్సైట్లో నుంచి టీడీపీ తొలగించింది. 2014 […]
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విజయవాడలోని బాలోత్సవ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలును వ్యతిరేకించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఏ రకంగా ఆ పథకాలను మరల తీసుకొస్తుందంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నిన్నమొన్నటి వరకు పెన్షన్లు, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తే జనం సోమరులైపోతారు, జాతీయసంపద ఆవిరైపోతోందన్న టీడీపీ వాళ్లు ఇప్పుడు సూపర్ సిక్స్ పేరుతో అంతకంటే ఎక్కువ హామీలు ప్రకటించడం మోసం […]
‘రాష్ట్ర ప్రజలు ఓపికగా ఉండి ఎక్కువ మంది పిల్లల్ని కంటే బాగా లాభపడతారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఒక ఆడపిల్ల ఉంటే నెలకు రూ.1,500, ఇద్దరు ఉంటే రూ.3,000, ముగ్గురు ఉంటే రూ.4,500.. అలాగే ఒక్కో పిల్లవానికి చదువు కోసం ఏడాదికి రూ.15,000 చొప్పున ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాం. ఎక్కువ మంది పిల్లలను కంటే టీడీపీ హయాంలో అంత లాభం’ ఈ చెత్త మాటలు చెప్పింది ఎవరో కాదు సాక్షాత్తు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన […]
మీ సూపర్ సిక్స్ పై నమ్మకం లేదయ్యా..
గతంలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి అన్న ఆర్నెల్ల ముందే కులానికో డజను హామీల చొప్పున మేనిఫెస్టో సిద్ధం చేసి జనాల్లో విపరీతమైన పబ్లిసిటీ చేసుకునే టీడీపీ ఈ ఎన్నికలకు మాత్రం ఇంకా మేనిఫెస్టో తయారు కూడా చేసుకున్నట్లు లేదు.. 2023 మే 28 న మినీ మేనిఫెస్టో అని సూపర్ సిక్స్ అని ఆరు హామీలతో ప్రకటన చేసి పూర్తి స్థాయి మేనిఫెస్టో దసరాకి విడుదల చేస్తాం అన్నారు. దసరా సమయం లో బాబు జైల్లో ఉండగా […]