తొంభై లక్షల మంది తల్లిదండ్రుల గుండెల పై భారాన్ని దించిన జగన్.
ఎండాకాలం సెలవలు అయిపోయి పిల్లల్ని స్కూల్స్ కి పంపే సమయం ప్రతి తల్లికి తండ్రికి అగ్ని పరీక్షే. స్కూల్ సెలెక్షన్, ఫీజు, ఆ ఇయర్ టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, బాగ్, స్టేషనరి, యూనిఫారం, బెల్ట్, షూ లాంటి వాటి కోసం ఒక యజ్ఞం నిర్వహించినంత పని అవుతుంది నేటి విద్యా వ్యవస్థలో .
కొంచెం ఆర్ధిక స్థోమత ఉన్న తల్లిదండ్రులే ఈ విషయాల్లో తల్ల కిందులు అవుతుంటారు. ఆర్ధిక స్తోమత లేని పేదవారు మాత్రం ప్రభుత్వ పాఠశాలలకు పిల్లల్ని పంపి సర్దుకొంటారు కానీ మిగతా ఖర్చులన్నీ తప్పవు. దిగువ మద్య తరగతి, బీద వారికి ఇవన్నీ భారమే, అరాకొరా పుస్తకాలతో, చిరిగిన యూనిఫారంతో చెదిరిన ఆత్మవిశ్వాసంతో కనపడే ప్రభుత్వ పాఠశాలలను చూస్తే ఎవరికి తమ పిల్లలని అక్కడ చదివించాలనిపించదు.
ఈ దుస్థితికి ప్రధాన కారణాల్లో విద్య ప్రభుత్వ భాద్యత కాదు అన్న చంద్రబాబు నైజం మొదటి కారణంగా చెప్పొచ్చు . కానీ గత టీడీపీ పాలనలో పేద మధ్యతరగతి పిల్లల చదువుల బాధ్యతను గాలికి వదిలేశారు చంద్రబాబు. విద్యా శాఖకి అరకొర నిధులు కూడా కేటాయించని చంద్రబాబు.. నీరు-చెట్టు పథకం పేరిట కార్యకర్తలకి రూ. 24 వేల కోట్లు, పుష్కరాల పనులకు రూ.6వేల కోట్లు, అసలు గ్రాఫిక్స్ లో తప్ప భూమి మీద కనపడని రాజధాని శంకుస్థాపనకు రూ.400 కోట్లు ఖర్చు పెట్టే చంద్రబాబు.. విద్యకు మాత్రం ఎప్పుడూ తగినన్ని నిధులు కేటాయించలేదు. ప్రచారం తప్ప .
జగనన్న విద్యాకానుక పథకం కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం గత నాలుగేళ్లలో 3366.53 కోట్లు ఖర్చు చేసింది. ఈ పథకంలో భాగంగా ప్రతి యేటా సగటున 45 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా లేని విధంగా 1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థిని, విద్యార్థులకు ప్రత్యేక స్కూల్ కిట్ల పేరిట బడులు మొదలైన మొదటి రోజే పిల్లలకు ఆ విద్యా సంవత్సరానికి కావాల్సిన టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, బాగ్, స్టేషణరీ, మూడు జతల యూనిఫార్మ్, వాటి కుట్టుకూలి డబ్బు, షూ, బెల్ట్స్ ఇలా అన్ని వస్తువులు అందచేస్తుంది వైఎస్సార్సీపీ ప్రభుత్వం.
విద్యా కానుక మాత్రమే కాకుండా ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశ పెట్టడం, బైలింగ్వల్ టెక్ట్స్ బుక్స్, ఇంటరాక్టివ్ ప్యానెల్స్, 8 th క్లాస్ పిల్లలకు టాబ్స్ వంటి వాటిని ప్రభుత్వ ఖర్చుతో సమకూర్చడం ద్వారా ప్రభుత్వ బడుల్లో విద్యను పండగలా చేశారు ముఖ్యమంత్రి జగనన్న .
ప్రతి యేటా సగటున 800 కోట్ల వ్యయంతో దాదాపు తొంభై లక్షల మంది తల్లిదండ్రుల వెతలు తీర్చి వారి బిడ్డల్లో ఆత్మవిశ్వాసం నింపి భవిష్యత్తు వైపు ధైర్యంగా పురోగమించేట్టు ముందుకు నడపడంలో విజయవంతం అయ్యింది జగనన్న విద్యా కానుక పధకం .
రాష్ట్రంలోని ప్రజల భవిష్యత్తును ఆకాంక్షిస్తూ.. చదువులు మాత్రమే రేపటి వారి తలరాతను మార్చగలవన్న నమ్మకంతో పిల్లలకు అన్నీ సమకూర్చి చదివిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభినందనీయులు .