వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికలకు తన నామినేషన్ ను ఈ నెల 22న పులివెందులలో తన కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులతో కలిసి దాఖాలు చెయ్యనున్నారు. దీని కోసం ముందు రోజు పులివెందులకు చేరుకుని ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ లో నివాళులు అర్పించనున్నారు. తరువాత తన పులివెందుల క్యాంప్ అఫీస్ లో పులివెందుల ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశంలో పాల్గొంటారు. . దానిలో ఈసారి ఎలక్షన్ లో ఎలా ప్రచారం చెయ్యాలో వాటి ప్రణాళికలను వివరించనున్నారు, ఈసారి టార్గెట్ లక్ష మెజారిటీకి తగ్గకుండా వుండాలి అని కీలక సూచనలు చెయ్యనున్నారు.
ఇక ప్రచార భాద్యతలు మొత్తం వైఎస్ భారతికి అప్పగించనున్నారు. వైఎస్ భారతి ఈ నెల 15న పులివెందులకి రానున్నారు, ఆరోజు నుండి ఎలక్షన్ వరకు పులివెందులలో వున్న ప్రతి గడపను తిరుగుతూ వైఎస్ జగన్ హయాంలో పులివెందులలో జరిగిన ప్రతీ అభివృద్ధిని వివరించి ఓట్లు అడగనున్నారు. మరోవైపు షర్మిల, సునీత ఇద్దరు తమ రాజకీయ స్వార్థంతో టీడీపీతో కలిసి వివేకానంద రెడ్డి హత్యను రాజకీయం చేస్తు పులివెందులలో కొన్ని ఇబ్బందులు సృష్టిస్తున్నారు. ఇవన్నీ గమనించిన వైఎస్ భారతి గారు పులివెందులలో ఈసారి లక్ష మెజారిటీ తక్కువ రావద్దు అని ఈ నెల రోజులు పులివెందులలో వుండి ప్రతి ఇంటికి తిరేగేలా ప్రచారానికి ప్లాన్ చేసుకుంటున్నారు. అంతే కాకుండా జిల్లాలో కీలకమైన చోట్ల వైఎస్ భారతి గారితో ప్రచారం చేపించడానికి వైఎస్ఆర్సీపీ నాయకులు ప్లాన్ చేసుకుంటున్నారు. చూస్తుంటే ఈసారి పులివెందుల, కడప జిల్లాలో రాజకీయం మంచీ రంజుగా వుండేలా వున్నాయి. ఇప్పటికే వైఎస్ భారతి గారి తరుపున సపోర్ట్ టీమ్ రంగంలోకి దిగారు ప్రచారానికి కావాల్సిన రూట్ మ్యాప్ అంతా సిద్ధం చేస్తున్నారు. అలాగే ఈ నెల 22న జగన్ నామినేషన్ ప్రక్రియ అనంతరం పులివెందులలో బహిరంగసభ కూడా వుండబోతుంది. ఆ ఏర్పాట్లు కూడా పార్టీ శ్రేణులు సిద్ధం చేసుకుంటున్నారు.