వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు ఎంత మంచి చేశాడో.. ఆయన్ను చూసి ప్రత్యర్థులు ఓటమి భయంతో ఎంతలా వణికిపోతున్నారో చెప్పేందుకు ఈ ఒక్క ఫొటో చాలు. వైఎస్సార్సీపీని ఓడించేందుకు, తెలుగుదేశం ఉనికి కాపాడేందుకు చంద్రబాబు నాయుడు ఏ స్థాయిలో ప్రయత్నిస్తున్నాడో చెప్పేందుకు ఇదే సాక్ష్యం.
‘జగన్మోహన్రెడ్డి తెలివ తక్కువోడా.. కాదు కదా. 40 ఏళ్లు, 45 ఏళ్లు అనుభవమని చెప్పుకొనే చంద్రబాబుకు చుక్కలు చూపిస్తున్నాడు.. ఇది రియాలిటీ’ ఎల్లో గ్యాంగ్‌లో కీలక సభ్యుడైన ఏబీఎన్ రాధాకృష్ణ ఇటీవల ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిని బట్టి జగన్ ఎంతటి బలవంతుడో అర్థం చేసుకోవచ్చు. ఆయన్ను ఒంటరిగా ఎదుర్కొనే ధైర్యం రాష్ట్రంలోని ప్రతిపక్షాలకు లేదు. అందుకే తమ మధ్య శత్రుత్వాలను పక్కనపెట్టి ఏకమయ్యారు.
గురువారం రాయలసీమలో ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎంలు నారా చంద్రబాబు నాయుడు, నల్లారి కిరణ్‌కుమారెడ్డి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం చేశారు. గతంలో వీరి దారులు వేరు. కానీ జగన్‌ను ఎదుర్కోవడానికి అవన్నీ పక్కన పెట్టేసి ఒక్కటయ్యారు. చిత్తూరు జిల్లాలో బాబు, నల్లారి కుటుంబాల మధ్య రాజకీయ వైరం చాలా ఏళ్ల నుంచి ఉంది. ఉమ్మడి ఏపీలో కిరణ్‌కుమార్‌రెడ్డి అనేకసార్లు చంద్రబాబు వైఖరిని ఎండగట్టాడు. అసెంబ్లీలో వాదోపవాదాలు చేసుకున్నారు. జగన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టాక వారిద్దరూ ఒక్కటయ్యారు. కేసులను ముందుపెట్టి ఇబ్బంది పెట్టారు. గత ఎన్నికల సమయంలో చిత్తూరు జిల్లాలో వైఎస్సార్సీపీని ఓడించేందుకు, సీనియర్ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెక్ పెట్టేందుకు బాబు కిరణ్ తమ్ముడు కిశోర్‌కుమార్‌రెడ్డిని తన పార్టీలో చేర్చుకున్నాడు. కానీ ఏమీ చేయలేకపోయారు. సోనియా గాంధీ అండ చూసుకుని ఎగిరిపడిన కిరణ్ రాజకీయ జీవితం ఏనాడో ముగిసింది. కానీ బీజేపీలో చేరి ఉనికి కోసం ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం రాజంపేట ఎంపీ అభ్యర్థిగా ఉన్నాడు. సీఎంగా చేసిన ఈయన జగన్ నిలబెట్టిన మిథున్‌రెడ్డి గెలిచేందుకు అష్టకష్టాలు పడుతున్నాడు. ఈ నేపథ్యంలో బాబు, పవన్‌ల సహకారం తీసుకుని ప్రచారం చేయించుకున్నాడు.
పవన్ కళ్యాణ్ అయితే ప్రజారాజ్యం సమయంలో కాంగ్రెస్ పార్టీని ఇష్టమొచ్చినట్లు మాట్లాడాడు. అప్పట్లో కిరణ్ కౌంటర్లు వేసిన సందర్భాలున్నాయి. ఇక సేనాని బాబుపై విరుచుకుపడినా కొన్నేళ్లుగా ఇద్దరూ కలిసి పొలిటికల్ సంసారం చేస్తున్నారు. భిన్న రాజకీయ సిద్ధాంతాలు కలిగిన వీరంతా వైఎస్సార్సీపీని ఓడిస్తామంటూ కలిసి ప్రచారం చేశారు. ఒక్క ఫొటో ఎన్నో విషయాలపై స్పష్టత ఇచ్చింది. రాష్ట్రంలో జగన్ మాత్రమే బలవంతుడని, ప్రతిపక్షాలకు చెందిన నేతలంతా పిరికివారని ఇట్టే అర్థమైపోతోంది.