చంద్రబాబు వస్తేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయంటూ టీడీపీ అనుకూల మీడీయా నిత్యం ఊదే గాలి వార్తల బుడగ పగిలిపోయింది. చంద్రబాబు మీడియాని అడ్డంపెట్టుకుని చేసుకునే ప్రచారం తప్ప ఆయన పాలనలో పెద్దగా పెట్టుబడులు ఏమీ రాష్ట్రానికి రాలేదని ఇప్పటికే అనేక నివేదికలు లెక్కలతో స్పష్టం చేస్తున్నా అవేమీ తెలియనట్టు నిత్యం బొంకుతూ వచ్చిన తెలుగు తమ్ముళ్ళుకి గొంతులో పచ్చి వెలక్కాయ పడేలా ఇండస్ట్రియల్ ఎంట్రపెన్యూర్స్ మెమరాండం ఇచ్చిన నివేదిక ఇప్పుడు మరోసారి వాస్తవాలని వెలుగులోకి తెచ్చింది.
ఐఈఏం నివేదిక ప్రకారం చంద్రబాబు ఐదేళ్ల పాలన కన్నా ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రధాన పారిశ్రామిక గమ్యస్థానంగా మారిందని వెల్లడించింది , బాబు ఐదేళ్ల పాలన కంటే మూడు రెట్లు ఎక్కువ పెట్టుబడులను ఆకర్షించిందని లెక్కలతో సహా కుండ బద్దలుకొట్టి చెప్పింది. 2014 నుండి 2018 వరకు, ఇండస్ట్రియల్ ఎంట్రపెన్యూర్స్ మెమరాండంస్ పార్ట్ బి ఫైలింగ్ ల ప్రకారం, రాష్ట్రం 32,803 కోట్ల వాస్తవ పెట్టుబడులు రాబడితే ఇప్పుడు జగన్ నాలుగున్నరేళ్లలో, 2019 నుండి జూన్ 2023 వరకు, రాష్ట్రానికి రాబట్టిన వాస్తవ పారిశ్రామిక పెట్టుబడి 100,103 కోట్లు గా ఉందని, ఇది 2014-18 కాలంలో వచ్చిన దానికంటే 226.9 శాతం ఎక్కువని అధికారిక వర్గాలు తెల్చేశాయి. నాలుగున్నరేళ్లలో కోవిడ్ మహమ్మారి, లాక్డౌన్లు మరియు దానితో సంబంధం ఉన్న అనేక అంతరాయాలను కలిగి ఉన్నా ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు వాస్తవ రూపంలోకి తీసుకుని వస్తూ పురోగతి సాదించడం మాములు విషయం కాదని జగన్ ప్రభుత్వ విధానాన్ని కోనియాడింది.
అలాగే కేంద్ర వాణిజ్య & పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ ద్వారా నిర్వహించిన వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక సూచికలలో మొత్తం 98.3 శాతం స్కోర్‌తో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్‌లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచిందని. ఈ ర్యాంకింగ్‌లో మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణ రెండో స్థానంలో ఉందని సదరు నివేదికలో పేర్కొంది . ఇన్ని రోజులు రాష్టానికి జగన్ పాలనలో పెట్టుబడులు రావడంలేదని అసత్య ప్రచారలు చేసిన తెలుగుదేశం , వారి అనుభంద పార్టీలు మీడియా చానల్స్ కి ఈ నివేదిక చెంపపెట్టు లాంటిదని చెప్పొచ్చు.