‘తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థి పోటీ చేయడమే నా ఆశయం. ఎక్కడి నుంచి బరిలో ఉంటాననేది మరో రెండు రోజుల్లో తేలుతుంది. అది ఎంపీగానో.. రాష్ట్రంలో ఎమ్మెల్యేగానో చూడాలి. పోటీ చేయడం పక్కా. ఎంపీగా నిలబడాలన్నది నా ఆశ. అసెంబ్లీలో చూడాలన్నది ప్రజల కోరిక. చాలామంది నన్ను స్పీకర్‌గా చూడాలనుకుంటున్నారు. నేను కోరుకున్న కేంద్రమా, ప్రజలు కోరుతున్న రాష్ట్రామా.. త్వరలో తెలుస్తోంది’ రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలివి. పశ్చిమ గోదావరి జిల్లాకు విచ్చేసిన ఆయన గురువారం విలేకరులతో ఇలా అన్నారు.
నరసాపురం టికెట్ కోసం రఘురామ తీవ్రంగా ప్రయత్నించాడు. వాడుకుని వదిలేయడంలో దిట్టగా పేరున్న చంద్రబాబు నాయుడు ఆయన గురించి పట్టించుకోలేదు. ఆ ఎంపీ సీటును బీజేపీకి ఇచ్చేశారు. రఘురామ వారి వెనుక పడి తనను వదిలేస్తాడని భావించాడు. కానీ ఏ ఎండకు ఆ గొడుగు పట్టే వ్యక్తికి టికెట్ ఇవ్వడం కమలం పెద్దలకు ఇష్టం లేదు. చాలాకాలంగా పార్టీకి సేవలందిస్తున్న భూపతిరాజు శ్రీనివాసవర్మను నరసాపురం అభ్యర్థిగా ప్రకటించారు. అప్పటి నుంచి రఘురామ తీవ్ర నైరాశ్యంలోకి వెళ్లిపోయాడు. బాబు మోసం చేసినట్లు స్పష్టంగా తెలుస్తున్నా.. కనికరిస్తాడేమోనన్న ఆశతో తనకు టికెట్ రాకపోవడానికి కారణంS వైఎస్ జగన్మోహన్రెడ్డి అని ఎల్లో మీడియాలో అన్నాడు. అయినా నారా వారు స్పందించలేదు. రఘురామకు అవకాశం ఇవ్వాలని కూటమిలోని పార్టీలకు చెప్పలేదు.
టీడీపీ, జనసేన ఉమ్మడి సభలో నరసాపురం టికెట్ నాకే.. ఏ పార్టీ ఇస్తే అందులోకి వెళ్లి పోటీ చేస్తానని మీసం తిప్పిన రఘురామ.. చంద్రబాబు మౌనంతో పిచ్చిపట్టినట్టుగా ప్రవర్తించాడు. ఈ నేపథ్యంలో ఆయనపైనే మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇతనితో మనకెందుకని బాబు ఎమ్మెల్యే సీటు ఇవ్వాడానికి సిద్ధమైనట్లు ఎల్లో మీడియాలో వార్తలొచ్చాయి. కానీ రఘురామ కన్నంతా నరసాపురం మీదే ఉంది. ఎలాగైనా బీజేపీని ఒప్పించాలని బాబుపై ఒత్తిడి తెస్తున్నాడు. అది సాధ్యమయ్యే సూచనలు కనిపించడం లేదు. దీంతో అసెంబ్లీ సీటైనా తీసుకోవాలని చూస్తున్నాడు. కానీ అంతటితో ఆగకుండా ముందుగానే ప్రజల కోరికంటూ స్పీకర్ కుర్చీపై కర్చీఫ్ వేశాడు. అసలు అతను రాష్ట్రంలో ఉన్నదే తక్కువ. ఢిల్లీలో ఉంటూ జగన్‌ను తిడుతూ కాలం గడిపాడు. ఇప్పుడు కోరికంటే అందరూ నవ్వుతున్నారు. సంవత్సరాల తరబడి పార్టీలో ఉన్న తెలుగు తమ్ముళ్లే ఏమీ మాట్లాడకుండా ఉంటే ఇతను మాత్రం ఎగిరెగిరి పడుతున్నాడని వాపోతున్నారు. ఏదో జగన్‌ను ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడు కాబట్టి రఘురామను బాబు చేరదీశాడని చెబుతున్నారు.
ఎమ్మెల్యే సీట్ల విషయంలో టీడీపీలో ఇంకా వివాదాలు సద్దుమణగలేదు. బాబు ఎన్నికల సభలు పేలవంగా జరుగుతున్నాయి. అసలు గెలుపుపై చంద్రబాబుకే ఇంకా నమ్మకం లేక అల్లాడుతున్నాడు. రకరకాల వేషాలు వేస్తున్నాడు. ఒకవేళ పొరపాటున రేపు టీడీపీ గెలిస్తే నారా వారు రఘురామ తోక కత్తిరించేస్తాడు. ఓడిపోతే ఎప్పటిలాగే ఏదో ఒకటి చెప్పి జగన్‌పై ఉసిగొల్పుతాడు. దీంతో అతను జోకర్‌గా మిగిలిపోనున్నాడు.