టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిద్ర లేచిన దగ్గర్నుంచి నేను బీసీల పక్షపాతిని, టీడీపీకి బీసీలే వెన్నుముక అంటూ మాటలు చెబుతూ తీరా వారికి రాజ్యాధికారం ఇచ్చి ప్రజా ప్రతినిధులుగా చేసే ఎన్నికలు రాగానే వారికి వెన్నుపోట్లు పొడుస్తూ తన సొంత జిల్లాలో తన సొంత సామాజిక వర్గానికి పెద్దపీట వేసి బీసీలకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు. అదే సమయంలో ప్రత్యర్ధి పార్టీ వైసీపీ తన పార్టీ తరపున ఇద్దరికి అవకాశము ఇచ్చింది. ఇప్పుడు ఇదే చిత్తూరు జిల్లాలో హాట్ టాపిక్ గా మారుతోంది. టీడీపీ ఆవిర్భావం నుంచి అండగా నిలిచింది కేవలం బీసీ వర్గమే. అలాంటి వారికి ఒక్క సీటు కూడా ఇవ్వలేదు.
ఇటు చూస్తే చిత్తురు జిల్లాలో మొత్తం నాలుగు జనరల్ సీట్లకు గాను చిత్తూరు అభ్యర్ధిగా తన సామాజిక వర్గానికి చెందిన గురజాల జగన్మోహన్ కు అవకాశం ఇచ్చారు బాబు. ఇక్కడ బలిజ నాయకుడికి మొన్నటి వరకు టికెట్ అని చెప్పి పదుల కోట్లు ఖర్చు పెట్టించి చివరకు తన సొంత సామాజిక వర్గానికి చెందిన అతనికి టికెట్ ఇచ్చారు,ఇక నగరిలో కూడా తన సామాజిక వర్గానికి చెందిన గాలి భానుప్రకాష్ కు టికెట్ కేటాయించారు, మరో వైపు పలమనేరులో అమర్నాథ్ రెడ్డికి టికెట్ ఇచ్చారు, ఇక కుప్పంలో చంద్రబాబు నాయుడు పోటీ చేస్తున్నారు. ఇలా మొత్తం నాలుగు తన సొంత సామాజిక వర్గానికి కేటాయించారు చంద్రబాబు నాయుడు. అదే సమయంలో వైసీపీ పలమనేరు నుండి బీసీ కి చెందిన వెంకటేష్ గౌడ , కుప్పం నుండి కె యస్ భరత్ కు టికెట్ కేటాయించారు వైఎస్ జగన్.
ఇవన్నీ చూస్తున్న చిత్తూరు జిల్లా ప్రజలు, ముఖ్యంగా బీసీలు టీడీపీ మొదటి నుండి కేవలం ఓట్ల కోసం వాడుకొని వదిలేస్తున్నారు, జగన్ మాత్రం నా బీసీలు అంటూ రెండు సీట్లు ఇచ్చాడు అనే అభిప్రాయానికి బీసీలు వచ్చినట్టు కనపడుతుంది.