2014 ఎన్నికల్లో వైజాగ్ నుండి ఎంపీ అభ్యర్థిగా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి సతీమణి, వైఎస్ జగన్ తల్లి గారైన వైయస్ విజయమ్మ వైసీపీ నుండి బరిలోకి దిగగా… కడప వాళ్లు వైజాగ్ లో గెలిస్తే వైజాగ్ లో భూములు కబ్జా చేస్తారు, కడప నుండి పంచెలు కట్టుకుని వచ్చి మీ వ్యాపారాలన్నీ నాశనం చేస్తారు. ఖూనీలు చేస్తారు అని టీడీపీ మనుషులని పెట్టించి మరీ ప్రచారం చేసింది, నారాయణ విద్యాసంస్థల్లో పని చేసే ఉద్యోగులతో మౌత్ పబ్లిసిటి చేయించింది. ఇక ఎల్లో మీడియా ప్రచారం అయితే హద్దే లేదు.
2019 లో జగన్ గెలిచిన తర్వాత కూడా వైజాగ్ ను పరిపాలనా రాజధానిగా ప్రకటిస్తే వైజాగ్ లో భూములను కొట్టెయ్యడానికే అని, సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి లు వైజాగ్ లో దందాలు చేస్తున్నారని తెగ విష ప్రచారం చేసిన బాబు, నేడు తన అనునాయుడు, ఆత్మబంధు, తనకోసం ఏ కార్యాన్నైనా చక్కబెట్టే సీఎం రమెష్ అనకాపల్లి నుండి పోటీ చేస్తే సరేనా?
సీఎం రమేష్ కూడా కడపకు చెందిన వాడే, వైఎస్ విజయమ్మకు గానీ, వైవీ సుబ్బారెడ్డి కి గానీ ఏ నేర చరితా లేదు, కానీ సీఎం రమేష్ అనే లాబీయిస్ట్ చరిత్ర అంతా నేరపూరితమే, సారా ప్యాకెట్ లను తమిళనాడు కు దొంగతనంగా ఎగుమతి చేస్తూ తాను తన తండ్రి అరెస్ట్ అయిన దగ్గర నుండి ఎదిగిన సీఎం రమేష్ అలియాస్ సారా రమేష్ గతం అంతా కబ్జాలు, దౌర్జన్యాలే. మరి అలాంటి వ్యక్తి ఉత్తరాంధ్ర లో అనకాపల్లి నుండి ఎంపీ గా పోటీ చేయడం ఎంతవరకు కరెక్ట్ బాబూ? టికెట్ ఇచ్చింది బీజేపీ అయినా ఇప్పించింది బాబేనని, సీఎం రమేష్ అంటే బాబు సొంత మనిషి అని తెలియనిది ఎవరికీ?
గతంలో కడప వాళ్లు వస్తే వైజాగ్ నాశనం అవుతుంది అన్న మాటే నిజం అయితే సీఎం రమేష్ ను అనకాపల్లి నుండి పోటీ చేయకుండా బిజెపి ని ఒప్పించాలి, లేదా గతంలో తాను చేసిన ఆరోపణలు తప్పు అయినా బాబు ఒప్పుకోవాలి. వైజాగ్ ప్రజలను మభ్యపెట్టినందుకు వారికి, కడప వారిని అవమానించినందుకు కడప ప్రజానీకానికి బాబు బేషరుతుగా క్షమాపణ చెప్పాలి..