ఇక తప్పేలా లేదు.. చంద్రబాబు ఆఖరి రాగం పాడినట్టే… కలలో కూడా వాలంటీర్లు వాలంటీర్లు అనే కలవరిస్తున్నట్లుగా ఉంది చంద్రబాబు వ్యవహారశైలి చూస్తుంటే. వాలంటీర్లను విధుల నుండి నిలిపివేయాలని నిమ్మగడ్డ ద్వారా పిటిషన్ వేయించి బొక్క బోర్లా పడ్డ బాబు, దానికి డ్యామేజ్ కంట్రోల్ చేసుకోడానికి రకరకాల పాట్లు పడుతున్నాడు.. ఇప్పుడు ఎన్ని చెప్పినా వాలంటీర్లు బాబుపై ఉన్న కోపాన్ని తగ్గించుకునేలా లేరని తాను అధికారం లోకి వస్తే వాలంటీర్లకు నెలకు పదివేలు ఇస్తానని వాగ్దానం చేసేశాడు…
ఇంట్లో మగవారు లేనప్పుడు తలుపులు కొట్టే వారికి పదివేలు ఇస్తావా?
వాలంటీర్లు అంటే ఉగ్రవాదులు, ఆడవారిని చెరిచే వారు వారికి పదివేలు ఎందుకు?
మహిళల సమాచారాన్ని హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ లకు అమ్మే వాలంటీర్లకు పదివేలు ఇవ్వడం ఎందుకు?
వాలంటీర్లు అందరూ వైసీపీ సానుభూతిపరులు, వారికి పదివేలు ఇవ్వడం అవసరమా?
అంటూ గతంలో చంద్రబాబు వాలంటీర్లపై చేసిన నీచమైన ఆరోపణలను గుర్తు చేసుకుంటూ వారు ఈ ప్రశ్నాస్త్రాలను సంధిస్తున్నారు..
అయినా చంద్రబాబు గారూ? జగన్ బోడి ఇంగ్లిష్ నేర్పిస్తాడు, మీరేమో ఏఐ నేర్పిస్తారు, మీరు అసలే బిల్గేట్స్ తోనే కూర్చుని కోడింగ్ చేసినా వారాయె, అలాంటి మీరు చీప్ గా వాలంటీర్ ఉద్యోగాలు ఇవ్వడం ఏమిటి సర్? అందరికీ ఏఐ నేర్పి అమెరికా కు ఎగుమతి చేయక? ముష్టి పదివేల జీతం ఇచ్చే ఉద్యోగాలు కూడా ఉద్యోగాలేనా?