ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కున అనంతరం చంద్రబాబు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఏనాడు సింగిల్ గా గెలిచిన దాఖలాలు లేవు. గెలిచిన ప్రతి ఎన్నికలోనూ ఆయా పార్టీలతో పొత్తుల్లో గెలవడమే తప్పితే, ఎన్నికల్లో పోటీ చేసిన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో తెలుగుదేశం పార్టీకి మచ్చకైనా కనపడవు. అయితే కాలక్రమమైన చంద్రబాబు నాయకత్వ లోపం, పార్టీని పటిష్ట పరచకపోవడం వంటి కారణాల దృశ్య తెలుగుదేశం పార్టీ అభిమానులు పార్టీ బ్రతికి బట్ట కట్టాలంటే ఎన్టీఆర్ వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పగ్గాలు తీసుకోవాల్సిందేనని ఆలోచనతో ముందుకు నడుస్తున్నటువంటి పరిస్థితులు మనకు తెలిసిందే…
ఈ నేపథ్యంలోనే గత కొన్ని ఏళ్లుగా జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడెప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెడతాడా ఎప్పుడు తెలుగుదేశం పార్టీని తన చేతుల్లోకి తీసుకుని ముందుండి నడిపిస్తాడా అనే ఆలోచనతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అదే విషయాన్ని జూనియర్ ఎన్టీఆర్ పై తమ ఆకాంక్షను అనేక సందర్భాల్లో వెలిబుచ్చిన సంగతులు చూసాం. అయితే ఈ ఆకాంక్షను గమనించిన చంద్రబాబు, లోకేష్ లు ఎక్కడ జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగితే పార్టీ తమ చేతుల్లో నుండి జారిపోతుందో అన్న భయంతో అనేక సందర్భాల్లో జూనియర్ ఎన్టీఆర్ పై పార్టీ శ్రేణులతో బురద జల్లించిన సందర్భాలు అనేకం గతంలో మనం చూడొచ్చు.
అయితే ప్రస్తుతం 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ దాడి మరింత తీవ్రమైన స్థితికి చేరింది. రేపు ఎన్నికల్లో ఓడిపోతే ఎక్కడ జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పగ్గాలు తీసుకుంటాడో అనే అనుమానంతో ముందుగానే నారా లోకేష్ డైరెక్షన్ లో జూనియర్ ఎన్టీఆర్ పై ఐ-టీడీపీ తో ఎటాక్ చేస్తున్నారు. ముందుగా బుద్దా వెంకన్నతో ఎన్టీఆర్ పై మాటల దాడికి శ్రీకారం చుట్టి అనంతరం ఐ-టీడీపీ తో బూతులు తిట్టిస్తున్నారు. ఇది 2024 ఎన్నికల్లో ఓడిపోయాక ఎక్కడ జూనియర్ ఎన్టీఆర్ వచ్చి టిడిపిని హ్యాండ్ ఓవర్ చేసుకుంటాడో అనే భయంతో లోకేష్ వేసిన స్కెచ్ గా భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. కేవలం తనకి భవిష్యత్తు లేకుండా పోతుందనే భయంతోనే లోకేష్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు అని, అందులో భాగంగానే ఐ-టీడీపీ ఉద్యోగులతో నేరుగా ఎన్టీఆర్ పై మాటల దాడికి తెరతీసాడని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే మాట్లాడుకోవడం గమనార్హం. అయితే ఎన్టీఆర్ పై ఏకధాటిగా సాగుతున్న ఈ మాటల యుద్ధం పై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లోకేష్ ఐ-టీడీపీ టీంకు ధీటుగానే సామాజిక మాధ్యమాల వేదికగా సమాధానాలు చెప్తున్నారు.