ఆరోజుల్లో.. అంటే చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్నప్పుడు దావోస్‌కు వెళ్లి చేసిన షో అంతా ఇంతా కాదు. రోడ్డున పోయే వారికి కోటు వేసి బాబుతో చర్చిస్తున్నట్లు వర్కింగ్ స్టిల్స్ వదిలేవారు. కాగితాలు మార్చుకుని ఎంఓయూలని బిల్డప్ ఇచ్చేశారు. విదేశీయులంతా ఆంధ్రా గోంగూర పప్పు లొట్టలేసుకుని తిన్నారని, ఫుడ్ విషయంలో సీఎం చాలా కేర్ తీసుకున్నారని సలహాదారులు ఎల్లో మీడియాతో పంచుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇక బాబు, ఆయన తనయుడు లోకేశ్ అప్పట్లో విదేశాలకు వెళ్లి వారిని కలిశాం.. వీరిని కలిశాం.. ఆ కంపెనీ వచ్చేస్తోంది.. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చేస్తున్నాయని ప్రచారం చేసుకున్నారు. వారి పనితనానికి వివిధ దేశాల అధ్యక్షులు, సాక్షాత్తు మన దేశ ప్రధాని నరేంద్రమోదీ ఆశ్చర్యపోయారని పచ్చ మీడియా కథనాలు వేసి మురిసిపోయింది. తీరా చూస్తే బాబు హయాంలో పెట్టుబడులు అనే పదాన్ని విపతీరంగా వాడారు తప్ప క్షేత్రస్థాయిలో ఒక్క ప్రాజెక్టు కూడా రాలేదని తేలింది.
ఎల్లో గ్యాంగ్ అంతా కలిసి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో పెట్టుబడులు రాలేదని, అభివృద్ధి శూన్యమని దుష్ప్రచారం చేస్తుంటుంది. కానీ వాస్తవం వేరేలా ఉంది. గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రానికి రూ.లక్ష కోట్లకు పైగా నిజమైన పెట్టుబడులు వచ్చాయి. కానీ ఎక్కడా జగన్ డబ్బా కొట్టుకోలేదు. విదేశీ కంపెనీల పెట్టుబడులే రూ.35 వేల కోట్లు. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం షో చేయలేదు. ఇదే జగన్‌కు, చంద్రబాబుకు మధ్య ఉన్న తేడా.
టీసీఎల్ రూ.5 వేల కోట్లు, పెప్పర్ మోషన్ రూ.4,640 కోట్లు, డైకిన్ రూ.2,600 కోట్లు, యకహోమా టైర్స్ సంస్థ రూ.1,929 కోట్లు, మాండలీస్ రూ.1,600 కోట్లు, టోరే రూ.1,000 కోట్లు, హిల్‌టాప్ సెజ్ (అదిదాస్) రూ.800 కోట్లు, పెట్రో గ్యాస్ రూ.600 కోట్లు, కాసిస్ రూ.500 కోట్లు, ఎల్ పాలిమర్స్ రూ.240 కోట్లు, ఎన్జీసీ ట్రాన్స్ మిషన్ రూ.185 కోట్ల పెట్టుబడులు పెట్టాయి. వీటి ద్వారా వేలాది మందికి ఉపాధి లభించింది. జగన్ సీఎం అయ్యాక కంపెనీలతో మాట్లాడడం, ఫౌండేషన్ స్టోన్ వేయడం, వేగంగా పనులు చేయడం, ఉత్పత్తులు మొదలు కావడం.. చకచకా జరిగిపోయాయి.