తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మూడున్నర దశాబ్దాలుగా కుప్పం వాసుల్ని మోసం చేస్తూనే ఉన్నాడు. ఈయన 14 సంవత్సరాలు సీఎంగా పనిచేసినా ఆ ప్రాంతంలో అభివృద్ధి జాడలు లేవు. అసలు ఇప్పటికీ అక్కడ బాబుకు సొంతిల్లు లేదు. కనీసం ఎమ్మెల్యే కార్యాలయం కూడా లేదంటే ఎంత నిర్లక్ష్యంగా ఉండేవారో అర్థం చేసుకోవచ్చు. టూరిస్ట్లా వచ్చి వెళ్లేవాడు.
వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కుప్పం నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. రెవెన్యూ డివిజన్ చేశారు. మున్సిపాలిటీ అయ్యింది వైఎస్సార్సీపీ హయాంలోనే. 2024 ఎన్నికల్లో తన ఓటమి ఖాయమని ఆందోళన చెందిన నారా వారు కుప్పం ప్రజలను మచ్చిక చేసుకునేందుకు మూడు సంవత్సరాల క్రితం ఇంటి నిర్మాణం పేరుతో డ్రామా మొదలుపెట్టారు. హైదరాబాద్‌ను కట్టేశా.. అమరావతిని కట్టేస్తా.. అంటూ బిల్డప్ ఇచ్చిన చంద్రబాబు తన ఇంటి నిర్మాణాన్ని 2021లో మొదలు పెట్టినా ఇంత వరకు పూర్తి చేయలేకపోయారు. అంతటి విజనరీ ఆయన.
శాంతిపురం మండలంలోని శివపురం క్రాస్ (చిన్న కడపల్లి పక్కన) వద్ద 1.76 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి ఇంటి నిర్మాణం పేరుతో హడావుడి మొదలుపెట్టారు. కుప్పం ప్రజల కోసమంటూ బిల్డప్ ఇచ్చారు. ఇప్పటికి ప్రహరీ కూడా పూర్తి కాలేదు. హైదరాబాద్‌లో మాత్రం ఇంద్ర భవనం కట్టుకున్న బాబు తనకు రాజకీయంగా జన్మనిచ్చిన కుప్పంలో ఇంటి విషయంలో మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్నారు. లక్షల కోట్ల రూపాయలకు ఆస్తి పరుడి గృహ నిర్మాణం సంవత్సరాల తరబడి సాగుతుండడంతో ప్రజలు ఔరా అంటున్నారు. కుప్పం వాసులపై చంద్రబాబుకు ఏ మాత్రం ప్రేమ లేదని దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. కేవలం ఓట్ల కోసం నిర్మాణం ప్రారంభించాడంతే. అసలు ఈ నియోజకవర్గ ప్రజలు ఈయన్ను ఎలా భరిస్తున్నారో పాపం.