కొన్నాళ్లు రాజకీయాలకు విరామం ప్రకటించిన గల్లా జయదేవ్, వీడ్కోలు సభలో మాట్లాడుతూ, ప్రత్యేక హోదాపై గళం విప్పినందుకు తనని వేధించారని చెప్పుకొచ్చారు. అయితే ఆ వేధింపులు ఎక్కడి నుండి ఎదురయ్యాయనేది మాత్రం వెల్లడించలేదు. హోదాపై పోరాడితే ఎవరు వేదించారనేది ఇప్పుడు ప్రశ్న. బీజేపీ నా? వైసీపీ నా? లేక టీడీపీ నా?
దానికన్నా ముందు గల్లా జయదేవ్ హోదాపై గళం ఇప్పి వేదనకు గురికాబడే అంత గొప్ప పోరాటం చేసిందెప్పుడు? హోదా కాకుండా ప్రత్యేక ప్యాకేజీ కేంద్రం ప్రకటించినప్పుడు టీడీపీ వారు పెట్టిన ధన్యవాద సభల్లో ఆయన కూడా ఉన్నారు.. హోదా అంటే జైలుకే అన్నప్పుడు ఆయన టీడీపీ లోనే ఉన్నారు అప్పుడు ఏ గళం విప్పారు? ఒకవేళ విప్పి ఉంటే వేధించింది టీడీపీ వారేనా? నాలుగున్నర ఏళ్లలో ఎన్నడూ హోదా అనే మాటే పార్లమెంట్ లో మాట్లాడకుండా, బాబు బిజెపి తో తెగతెంపులు చేసుకుని ఎన్నికల స్టంట్ లో భాగంగా హోదా కావాల్సిందే అని హడావిడి చేసినప్పుడు మాత్రమే బాబు ఆదేశాల దృష్ట్యా పార్లమెంట్ లో ఒకేఒకసారి మాట్లాడారు.. “మిస్టర్ ప్రైమ్ మినిస్టర్” అనే స్పీచ్ ని టీడీపీ వారు తెగ ఎలివేషన్ ఇచ్చి వీరుడు శూరుడు అని పొగిడి ఊరేగింపులు కూడా చేసారు. అదొక్క సందర్భమే ఆయన హోదా అనే పదాన్ని వాడటం. దానికే ఆయన్ని వేధిస్తే, ఇక 2014 నుండీ హోదా కోసమే పోరాటం చేస్తున్న వైసీపీ ఎంపీ లని, ప్రతీ స్పీచ్ లో హోదా ఇవ్వాల్సిందే అని మాట్లాడిన వారినీ, రాష్ట్ర స్థాయిలో దేశ రాజధానిలోనూ హోదా కోసం పోరాటం చేసిన వైసీపీ వారిని ఇక ఏ స్థాయిలో వేధింపులకు గురి చేసి ఉండాలి?
“మిస్టర్ గల్లా జయదేవ్” తమరు హోదా కోసం ఏ గళమూ విప్పలేదు, మిమ్మల్ని ఎవరు వేదింపులకూ గురిచేయలేదు ఇది తెలుగు ప్రజలందరికీ తెల్సిన ఒక సాధారణ విషయం… టీడీపీ అధికారంలోకి రాదు అనీ, వచ్చే అవకాశమూ లేదని, వైసీపీ లోకి మీకు ఆహ్వానం లేదనీ అర్థం అయ్యాక వ్యాపారాలు సక్కబెట్టుకోవడానికి మీరు రాజకీయాల నుండి వైదొలుగుతున్నారు అని అందరికీ తెలుసు.. మీ సొంత ఎలివేషన్స్ మానుకోరా దయచేసి?