‘చేనేతలను చాలా పార్టీలు చిన్నచూపు చూస్తుంటాయి. కానీ గుర్తించింది ఒక్క జగనన్న మాత్రమే’ అని రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ జింకా విజయలక్ష్మి. మేమంతా సిద్ధం బస్సు యాత్ర శనివారంతో 14వ రోజుకు చేరుకుంది. మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్ లో చేనేత కార్మికులతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడారు.
నేను చేనేత బిడ్డను. మధ్యతరగతి కంటే దిగువన ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. సాధారణ మహిళనైన నన్ను జగనన్న తన ప్రభుత్వంలో పద్మశాలి కార్పొరేషన్‌కు చైర్‌పర్సన్‌ను చేశారు. ఈరోజు చేనేత విభాగానికి సంబంధించిన నిర్వహించమని చెప్పినందుకు ఆయనకు ధన్యవాదాలు. పార్టీ స్థాపించిన రోజు నుంచి జగనన్నతోనే నా ప్రయాణం సాగుతోంది. ఎప్పుడూ కూడా నా వ్యక్తిగత విషయాలను అన్నకు చెప్పుకోలేదు. అయినా కూడా నా కాళ్లకు సంబంధించి అనారోగ్య సమస్య ఉందని ఆయన తెలుసుకున్నారు. నేను ఎప్పుడు కనిపించినా జాగ్రత్తగా ఉండు తల్లీ అంటారు. తనను నమ్ముకున్న వారికోసం ఏ విధంగా ఆలోచిస్తారో అనే చెప్పేందుకు ఇది ఒక ఉదాహరణ. దీనిని అందరూ గుర్తించుకోవాలి. చేనేత వృత్తిని ఏ ప్రభుత్వం, ఏ నాయకుడూ గుర్తించింది లేదు. ఎవరికీ మనపై అవగాహన లేదు. మనసు ఏలదు. కానీ దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మనకు 50 ఏళ్లకే పెన్షన్ అందించే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఆప్కో ద్వారా ఎన్నో సబ్సిడీలు ఇచ్చారు. సీఎం జగనన్న ఎక్కడా లేనివిధంగా చేనేతలకు నెలకు రూ.2 వేల చొప్పున ఏడాదికి రూ.24 వేలను పెట్టుబడి సహాయం అందిస్తున్నారు. నవరత్నాల్లో అగ్రభాగం అందుకుంది చేనేతలే. ప్రజా సంకల్ప పాదయాత్రలో చేనేతల కష్టాలను ఆయన కళ్లారా చూశారు. సమస్యలను తెలుసుకున్నారు. టీడీపీ హయాంలో చేనేతలను నట్టేట ముంచితే ఆప్కోను బయటికి తీసుకొచ్చి రూ.180 కోట్లను అందించారు జగనన్న. కరోనా కష్టకాలంలో రెండుసార్లు రూ.24 వేలు ఇవ్వడం జరిగింది. కాబట్టి లాంటి నాయకుడు మనకు ఉండడం ఎంత అవసరమో ఆలోచన చేయాలి. మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, పద్మశాలి సామాజికవర్గానికి చెందిన లావణ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి.
విజయలక్ష్మి ప్రసంగం ఆధ్యంతం ఆకట్టుకుంది. ఆమె జగనన్న చూపించే ఆప్యాయతను పూసగుచ్చినట్లు చెప్పారు. ఆయన ప్రభుత్వం చేనేతలను ఎలా ఆదుకుందో వివరించారు. కరోనా కష్టకాలంలో ఏ స్థాయిలో అండగా నిలిచిందో తెలిపారు.