స్కిల్ స్కాం కేసులో నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ జీర్ణించుకోలేని కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు మరణించారని చెబుతూ ఆ కుటుంబాలకి సహాయార్థం నారా భువనేశ్వరి నిజం గెలవాలి పేరుతో ఒక యాత్రని ప్రారంభించింది. ఇప్పటికే కొన్ని జిల్లాలలో నిజం గెలవాలి పేరుతో సాగుతున్న యాత్ర పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఏలూరు జిల్లాలో జంగారెడ్డిగూడెం, భీమడోలు ప్రాంతాలలో పర్యటిస్తున్న నారా భువనేశ్వరిని కలవడానికి కొంతమంది తెలుగుదేశం నాయకులు ప్రయత్నించగా వారిని నారా భువనేశ్వరి సెక్యూరిటీ అడ్డుకుంది.
ఏలూరు ఎంపీ అభ్యర్థిగా పుట్ట మహేష్ యాదవ్ ని ప్రకటించడంతో ఆ విషయమై మాట్లాడడానికి నాయకులు ప్రయత్నించగా సెక్యూరిటీ అడ్డుపడడంతో ఆ ప్రాంగణమంతా రసాభాసగా తయ్యారు అయింది. సెక్యూరిటీ , తెలుగుదేశం పార్టీ నాయకులు ఒకరినొకరు కొట్టుకోవడానికి సిద్ధమయ్యారు. ఇంతలోనే లోకల్ పోలీసులు రావడంతో గొడవ ఆగింది. రెండు రోజుల క్రితం అన్నమయ్య జిల్లా రాయచోటిలో నిజం గెలవాలి యాత్ర చేపట్టిన నారా భువనేశ్వరి పై వైసీపీ పార్టీ నేతలు ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే, ఎన్నికల కమిషన్ అనుమతి లేకుండా నిజం గెలవాలి యాత్ర చేపడుతూ పార్టీ కార్యకర్తలకి డబ్బులు పంపిణీ చేస్తున్న తరుణంలో వైఎస్ఆర్సీపీ వారు ఫిర్యాదు చేశారు. ఈ పిర్యాదు పై విచారణ జరుగుతుండగానే మళ్ళీ ఈ వివాదం చోటు చేసుకోవడం గమనార్హం .