ఏపీలో మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగనుందని ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. వారి వ్యాఖ్యలకు బలం చేకూరుస్తూ జాతీయ స్థాయి సర్వే సంస్థలతో పాటు మెజారిటీ సర్వేలన్నీ వైసీపీదే అధికారం అంటూ స్పష్టం చేస్తున్నాయి. తాజాగా టైమ్స్ నౌ సర్వే కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. టైమ్స్ నౌ ఈటీజీ సర్వే ప్రకారం రానున్న లోక్సభ ఎన్నికల్లో 25 స్థానాల్లో 20 స్థానాల్లో అధికార వైసీపీ విజయం సాధిస్తుందని టీడీపీ కూటమి కేవలం 4-5 స్థానాలకు పరిమితం అవుతుందని వెల్లడించింది.
మరోవైపు నాగన్న సర్వే, జన్ మత్ పోల్స్, పొలిటికల్ క్రిటిక్, ఆర్ఫీ సర్వే, థర్డ్ విజన్ సర్వే, ఎలెసెన్స్ సర్వే, ఆత్మసాక్షి సర్వే, పోల్ స్ట్రాటజీ గ్రూప్ లాంటి సర్వే సంస్థలు తమ సర్వేలలో వైసీపీదే అధికారం అని స్పష్టం చేసాయి. ఆర్పీ సర్వే వైసీపీకి 135 స్థానాలు వచ్చే అవకాశం ఉందని వెల్లడించగా, థర్డ్ విజన్ సర్వే వైసీపీకి 123-128 స్థానాలు వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది. ఎలెసెన్స్ సర్వే 127 స్థానాలతో వైసీపీ అధికారం చేపట్టే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆత్మ సాక్షి సర్వేలో వైసీపీకి 139-142 స్థానాలు దక్కే అవకాశం ఉందని అంచనా వేయగా జన్మత్ పోల్స్ సర్వే మాత్రం 125 స్థానాలను వైసీపీ దక్కించుకుంటుందని వెల్లడించింది. పోల్ స్ట్రాటజీ గ్రూప్ గ్రూప్ మాత్రం 130 స్థానాలతో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టే అవకాశం ఉందని అంచనా వేసింది.
సర్వేలన్నీ వైసీపీకి అనుకూలంగా ఉండటంతో వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, పాలనలో చూపిస్తున్న అభివృద్ధి కారణంగానే తిరిగి వైసీపీకి ప్రజలు పట్టం కట్టనున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.