బ్రిటిషర్ల టైం లోనే బాగా ప్రసిద్ధి గాంచి తరువాత వెనుకబడ్డ ప్రకాశం జిల్లా చీరాల వద్ద ఉన్న వాడరేవు నుండి గుంటూరు జిల్లాలో ఉన్న నిజాంపట్నం వరకు సాగర్ తీరం వాడుకొని బలమైన ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మించాలి అని వైఎస్ఆర్ ఆశయం. 26 కిలోమీటర్లు సాగర తీరం లో నిర్మించ దాల్చిన ఈ ప్రాజెక్ట్ కు రాస్ అల్ ఖైమ ఇందులో 51 శాతం పెట్టుబడులు పెట్టేటట్లు నిమ్మగడ్డ ప్రసాద్ కు చెందిన మాట్రిక్స్ & పోర్ట్ 49 శాతం ఇన్వెస్ట్మెంట్ చేసేటట్లు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రభుత్వంకు ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా ఈ కారిడార్ లో ఉన్న ప్రభుత్వ భూమిలో వాన్ పిక్ యే డెవలప్ చేసే విధంగా ప్రతిపాదనలో ఉంది.
వాన్ పిక్ ప్రాజెక్ట్ పూర్తి అయ్యూంటే ఈ పాటికి వేలాది మందికి అవకాశాలు దొరికేవి. వాన్ పిక్ ప్రాజెక్ట్ రూపం దాల్చి ఉంటే ఈ పాటికి వేలకోట్ల పెట్టుబడులు వచ్చేవి. రేపల్లె ,బాపట్ల, చీరాల మొదలైన ప్రాంతాల ముఖచిత్రమే మారిపోయేది. ప్రకాశం, గుంటూరు, కృష్ణ జిల్లాలకు అత్యధిక ప్రయోజనం కలిగి వుండేది. కానీ వై ఎస్ ఆర్ మరణం తర్వాత రాజకీయ దాష్టీకానికి ఆ ప్రాజెక్ట్ బలి అయిపోయింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండి ఉంటే ఈ ప్రాజెక్ట్ ఒక రూపం దాల్చేది .
వాన్ పిక్ ప్రాజెక్ట్ అనుకున్నట్లుగా జరిగి ఉంటే పోర్ట్ ఆధారిత పరిశ్రమల, పవర్ ఆధారిత పరిశ్రమలు పెట్టుబడి ద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించి ఉండేది.
ఈనాడు యెల్లో మీడియా ఆరోపణలు చేస్తున్నట్లు 13 వేల ఎకరాలు ఎక్కడ ప్రభుత్వం కేటాయించలేదు. 99 శాతం భూమిని ప్రైవేట్ వ్యక్తులు నుంచి ఆ రోజు ఉన్న మార్కెట్ రేట్ ప్రకారం కొనుకున్నారు , వై యస్ ప్రభుత్వం వాన్ పిక్ ప్రాజెక్ట్ కోసం కేటాయించింది కేవలం 170 ఎకరాలు మాత్రమే. కానీ పచ్చ కళ్ళకి మాత్రం వేల ఎకరాలు దొచేసినట్లు కనిపిస్తాయి.
ఈనాడు ఎల్లో మీడియా చెప్తున్నట్లు వాన్ పిక్ సంబంధించిన మొట్ట మొదటి సారి చంద్ర బాబు గొప్పగా చెప్పుకునే విజన్ 2020 డాక్యుమెంట్స్ లో ఈ వాన్ పిక్ ప్రాజెక్ట్ ప్రతిపాదన 1999 లో రాసుకున్నాడు. అప్పుడే చంద్రబాబు దీనిని ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వాలని చెప్పినట్లు చెప్పారు, తర్వాత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేట్ పరంగా కానీ ఎటువంటి అడుగులు వేయకపోవడం గమనార్హం. రాష్ట్రాన్ని సంపద సృష్టించాలి , వనరులు ఏంటి అని ఆలోచించకుండా మనం ఎప్పుడు దోచుకోవాలి, మన వాళ్ళకి ఎలా దోచిపెట్టాలి అనే ధోరణిలో పాలన జరిగితే అభివృద్ది వైపు అడుగులు ఎలా పడుతాయి.
జూలై 28 2022 లో వాన్ పిక్ పై సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లు తెలంగాణ హై కోర్టు కొట్టేసింది . సీబీఐ పెట్టిన చార్జిషీట్ లో ఎటువంటి వాస్తవాలు లేవు, ఆధారాలు లేవు అని గౌరవ కోర్టు తేల్చిచెప్పింది. ED ట్రిబ్యునల్ జూలై 8 2022 లోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వలు కావాలంటే అక్కడ ఎలాంటి పరిశ్రమలు అయినా ఏర్పాటు చేసుకోవచ్చు అని తన నిర్ణయం ట్రైల్ కోర్టు కి తెలిపింది. నీలి నీడలు అన్ని తొలిగిన ఎల్లో మీడియా కి మాత్రం బుర్ర పని చేయదు. బురద చల్లడమే ప్రధాన అజెండా అయినప్పుడు వాస్తవాలు పక్కన పెట్టి ఏమి కావాలి అంటే అది రాస్తారు.